Devanand Saragonda TITLE Artist

Devanand Saragonda TITLE Artist కళ మనిషిలో పుట్టిన ఒక కల.ఇదే నా కలం లో?

మీరు రేపటి తరానికి స్ఫూర్తిగా మారాలని ఆశిస్తూ..
01/01/2026

మీరు రేపటి తరానికి స్ఫూర్తిగా మారాలని ఆశిస్తూ..

దేవునికే మహిమ.క్రీస్తు పుట్టుకను ప్రచురించే ప్రతి వేదికకు..ప్రతి వేడుకకుప్రతీకగా ఈ శీర్షికలు ముద్రించబడిఈ పండుగతో క్రీస్...
01/12/2025

దేవునికే మహిమ.

క్రీస్తు పుట్టుకను ప్రచురించే
ప్రతి వేదికకు..ప్రతి వేడుకకు
ప్రతీకగా ఈ శీర్షికలు ముద్రించబడి
ఈ పండుగతో క్రీస్తువైపు ఆకర్షితమవ్వాలని
నా స్వహాస్తకళతో చెక్కిన
విలక్షణ అక్షరమాలికలు..

ప్రభు పనిలో.. ప్రభు సేవలో
అనేక పరిచర్యలలో వినియోగమవ్వాలని
ఆశిస్తున్నాను.

సంప్రదించండి
వినియోగించండి,షేర్ చేయండి
అందరికి చేరువచేయండి.
మరింతకాలం మీతో మీలో ఒక జతపనివానిగా ప్రభు సేవలో ఈ వినూత్న కళను క్రీస్తు రాజ్య స్థాపనలో ఆయుధంగా వాడబడాలని కోరుతూ..
నా కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థించండి..

D-Gospel Music Team Wedding Music at NagarKurnool Singing moments Capture by Srikanth from Nagar kurnool.
27/11/2025

D-Gospel Music Team
Wedding Music at NagarKurnool
Singing moments
Capture by Srikanth from Nagar kurnool.

ఇప్పటివరకు మీ ప్రోత్సాహంతో సరికొత్త ఒరవడిగా నేను రాసిన శీర్షికలు   మీ పరిచర్యలో భాగమై నా కంటూ ప్రత్యేక గుర్తింపును కలిగి...
24/11/2025

ఇప్పటివరకు మీ ప్రోత్సాహంతో సరికొత్త ఒరవడిగా నేను రాసిన శీర్షికలు మీ పరిచర్యలో భాగమై నా కంటూ ప్రత్యేక గుర్తింపును కలిగించిన నా ఆత్మీయులందరికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ శుభవార్త మీతో...

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోస్టర్ డిజైన్స్ మరియు స్టేజ్ backgrounds మీద ఈ వేడుకలనిద్దేశించి ప్రతీకగా నిలిచే ప్రత్యేకమైన తెలుగు మరియు English ఫాంట్స్, టైటిల్స్ గా తక్కువ ధరలో ఓపెన్ ఫైల్స్ రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ నా ప్రయత్నం.

నా పరిచర్యలో భాగస్వాములై నాకు సహాయ సహకారాలు అందిస్తూ మరింతగా నన్ను ప్రోత్సహించి నాతో కలిసి ఈ పనిలో ప్రయాణం చేస్తున్నా Graphic Designers కి నా ప్రత్యేక వందనాలు.

Met toGreat man of god  Ministries Gudiwada.at Mourya inn Kurnool.
26/09/2025

Met to
Great man of god
Ministries Gudiwada.
at Mourya inn Kurnool.

D-TitlesThanq For your Great Opportunity Dear Daniel Praneeth Anna Gaaru. Refference by Bhanu pala garu Thanq brother.ఒక...
26/08/2025

D-Titles
Thanq For your Great Opportunity Dear Daniel Praneeth Anna Gaaru. Refference by Bhanu pala garu Thanq brother.
ఒక్క పాట ఒకే ఒక్క పాట
ఓ బలమైన విశ్వాసి హృదయంలోనుంచి పుట్టింది.
ఆ ఒక్క పాటలోని ఆ ఒక్క మాట
ఎన్నో లక్షల హృదయాలను దైర్యపరిచింది..
ఆ మాట! "ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు" అని తమ ఆరాధ్య దేవునిపై కేంద్రీకృతమయ్యేలా
ఓ బలమైన ఆధ్యాత్మిక భావ సంకల్పాన్ని నూరిపోసింది.

నేను ఆరాధించే దేవుడు ఏమైనా చేస్తాడు
నా జీవిత కథ మొత్తం మార్చగలడనే
విశ్వాసాన్ని రెట్టింపు చేస్తూ
పాటలోని ఒక్కొక్క మాట వింటున్న ప్రతి హృదయాన్ని స్థిరపరిచి బలపరిచి ఆరాధనలో సాక్షాత్తు
ఆ దేవునితోనే స్పర్శించేలా చేసింది.

అలా స్పర్శించిన హృదయంలో దాగిన అనుభవపూర్వక
భక్తి భావాలకు మరోసారి ఊతమిస్తూ..
కలిగే ఊహకే మించిన నిజమైన కార్యాలు జరిగించే
ఘనమైన ఆలోచనలు కలిగిన దేవుడని నమ్మి
సమస్త అనుగ్రహాలకు ఆయనే సరైన సమూహియని
అందుకే "సర్వకృపా నిధి" ఆయన పేరని
స్మరించి స్తుతించేలా చేసింది..

నాకు రూపమిచ్చి నాలో జీవమిచ్చి నన్నిలా నిర్మించిన
ఆ నా దేవుడే సర్వ సృష్టిని చేసిన పరమ కుమ్మరి
అని గుర్తు చేసుకుంటూ!
ఇక నా జీవము ఆయన చేతిలోనే గదా ఉన్నదని నమ్మి
నన్ను ఘనపరచాలన్నా..హెచ్చించాలన్నా..
నాకు జయమివ్వాలన్నా ఆయనే నిజమని
అంగీకరించి సమర్పించుకుని ఆరాధించేలా చేసింది..
నా పక్షాన నిలిచి..
చేస్తాడు ఏమైనా చేస్తాడు ఆయనే నా కథను మారుస్తాడు
అనే ఆశకు సంగీత శ్వాసగా మారి మరింత విశ్వాసాన్ని రేకెత్తించింది.

అయన ఆజ్ఞ లేకుండా ఏది జరగలేదు.జరగదు కూడా!
ఆయన నా చుట్టూ వేసిన కంచెను ఎవరైనా దాటగలరా? అది శత్రువుకైనా సాధ్యమవుతుందా? సాధ్యపడదు కదా!
అనే దృఢమైన ఆధారిత భావనను రగిలించి
ఇక నా దేవుడు నాతో ఉంటే చాలునంతే!
అపవాది తలపెట్టే కీడు కాదు కదా అసలు పెట్టాలని తలంచిన ఏ కీడైన ఓ గొప్ప మేలుగా మారిపోవునని
ఉద్వేగమైన ఊరట నిచ్చింది..

ఇలా ఎన్నో బావోద్వేగ హృదయాలను కదిలిస్తూ ఈ విశ్వాస భావాపూరితమైన పాటలోని పదాలు గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయిన స్వరాలుగా సరిగ్గా హృదయపు నరనరాల్లో ప్రతిధ్వనించిన సంగీత శబ్దాలుగా తెలుగు క్రైస్తవ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశిస్తూ..

క్రైస్తవ ఆధ్యాత్మిక సంగీత అభిమాని
Devanand Saragonda
D-Media Network

నిండా నాలుగేళ్లు నీతో గడిచిన నా జీవిత ప్రయాణం సుఖం సౌక్యం సౌభాగ్యం ఎన్నో ఒడిదుడుకులనైనా మరెన్నో పోరాటాలనైనా దాటుకొని ఎదు...
18/08/2025

నిండా నాలుగేళ్లు నీతో గడిచిన
నా జీవిత ప్రయాణం సుఖం సౌక్యం సౌభాగ్యం
ఎన్నో ఒడిదుడుకులనైనా మరెన్నో పోరాటాలనైనా
దాటుకొని ఎదురించగలననే జీవన ధైర్యాన్ని నేర్పించిన
నా సహచరివి నా జీవిత భాగస్వామివి..

దైవిక చిత్తంలో నాతో జతపడి అదే నడవడిలో
నాతో కలివిడిగా ముందున్న జీవితాన్ని
బంగారు భవిషత్తును నిర్మించుకుంటూ..
కలిమిలో లేమిలో నాతో చెలిమిగా ఓరిమితో
నాతో కొనసాగుతున్న
నా చెలివి నా ప్రియ సఖివి..

నా ఊహల్లోన్ని నా ప్రతిరూపాలకు తల్లిగా నీ రూపానిచ్చి
నన్నోక తండ్రిని చేసి నీతో కలిసి మన ప్రతిరూపాలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించగలననే జీవిత నమ్మకాన్ని నింపిన
నా సతీమణివి నా అరుదైన ఆణిముత్యనివి..

అక్షరాంజలి..ఈ గొంతు గుండెలోతుల్లో దాగిన ఆత్మీయతను తట్టిలేపుతుంది..ఈ రాగం మనసులో నిండినఆధ్యాత్మికతను గుర్తుచేస్తుంది..ఈ స...
08/08/2025

అక్షరాంజలి..

ఈ గొంతు గుండెలోతుల్లో దాగిన
ఆత్మీయతను తట్టిలేపుతుంది..
ఈ రాగం మనసులో నిండిన
ఆధ్యాత్మికతను గుర్తుచేస్తుంది..
ఈ సాహిత్యం మనిషిలోని మలినాన్ని తుడిచి..
ఆరాధ్య దేవునిలో అనుభూతి భావాల్ని కలిపి..
ఆనందమయమైన రాగల్ని పలికి ఆరాధిస్తూ..
క్రీస్తుతో గడిపేందుకు ఆ మహిమకు చేరువచేస్తుంది..
ఇది పరమునుండి పోయబడిన పరిమలతైలమై..
పరిశుద్ధాత్మునితో నింపి దేవునితో సహవాసం చేసే..
నా అనుదిన స్తుతిగీతాల ఆహారం..

ఇది నా తొలి సంగీత అనుభవ
ఆధ్యాత్మిక జీవన ఆరాధన గీతం.
Glory to god.
I love yours voice
The great worshiper
Dear 🇾‌🇪‌🇸‌🇦‌🇳‌🇳‌🇦‌ Gaaru
Your my inspiration
Miss you..alot..❤️

Yours❤️
Devanand Saragonda




నా శీర్షిక రాతల ప్రయాణంలో ఒక మైలురాళ్లు ఈ ఆధ్యాత్మిక సంగీత సంకలనాలు.ఈ పాటల రచయిత గురించి ఎప్పటినుంచో చెప్పాలనుకున్నా కాన...
25/07/2025

నా శీర్షిక రాతల ప్రయాణంలో ఒక మైలురాళ్లు
ఈ ఆధ్యాత్మిక సంగీత సంకలనాలు.

ఈ పాటల రచయిత గురించి ఎప్పటినుంచో చెప్పాలనుకున్నా కానీ సమయం ఆ బావం కుదరలేదు.

🇳‌🇪‌🇪‌🇱‌🇴‌🇳‌🇪‌ 🇦‌🇳‌🇦‌🇳‌🇩‌🇭‌🇦‌🇲
https://youtu.be/eRAkyLWaCIo?si=NvLrO8kKLGnSJ9UI
నీలోనే ఆనందం ‌ అనే గీతం ఎన్నో హృదయాలను కదిలించిన పాట.నాకు తెలిసి బ్రదర్.ఇవాన్ మార్క్ గారు తెలుగులో ఇప్పటిదాకా పాడిన పాటలన్నిటికీ నేనే శీర్షికలు (టైటిల్స్) రాశాను. ఒకటేదో సమయం కుదరక రాయలేకపోయాను.అయితే తనకంటూ ప్రత్యేకమైన మార్క్ కలిగి ఆధ్యాత్మిక గీతాలు పాడుతూ మనకందిస్తున్నారు.మరిన్ని పాటలు పాడాలని దేవుని ప్రార్ధిస్తాను.

అలాగే మొదటిసారి పాడిన ఈ పాటల రచయిత కుమారుడైన జోష్ మండ్రు తమ్ముడి పాటకి నేనే టైటిల్ రాయడం చాలా సంతోషం. ఈ కొత్త స్వరం హృదయాన్ని హత్తుకునే గీతం 🇱‌🇪‌🇷‌🇺‌
🇾‌🇪‌🇻‌🇦‌🇷‌🇺‌ 🇳‌🇪‌🇪‌🇱‌🇦‌ లేరు ఎవరు నీలా
వినండి కొత్తగా విడుదలయింది.
https://youtu.be/s9_rKdFSOs0?si=FNHXgkMeiJsnkrzS

ఒక టైటిల్స్ విషయంలోకూడ దేవుని నడిపింపులో ఆత్మపూర్వకంగా తనకి రాసుకున్న ఫీలింగ్ ఎలాగో అలా అనిపిస్తేనే అది ఫైనల్ చేస్తారు.అయిన ఎన్ని రాసిన వాటికి వెల కూడా అంతే చెల్లిస్తారు.కొన్నిసార్లు విసుగుపడే వాడిని ఏంటి ఇలా ఉన్నారు ఈయన అని. అయితే ఈ పాటలు విడుదలై ఇంత ఆదరణ పొందినాకా అనిపించేది నేను కాదు ఇది చేసింది దేవుని నడిపింపుతో రాసిన పాటలకు ఆత్మ నడిపింపుతో చేసిన పని అని గుర్తుచేసుకునే వాడిని.

ఒకరి హృదయంలో ఎన్నో హృదయాల భావాలు దాగివుండి వారి హృదయాలను కదిలించే రాగాలు కలిగుండి పాడించిన, సంగీతం సమాకూర్చిన ఆత్మ నడిపింపే ప్రామాణికం అని బావించే వ్యక్తిగా దేవుని ఉద్దేశ్యమే ఇందుకు కారణం కావాలని మొండిగా పనిచేసే తత్వం పనిచేయించుకునే గుణం ఈ రచయిత నైజం.

అందుకేనేమో ఈయన పాటల్లో హృదయాలు కరిగి దేవునికి సమర్పితం అయ్యేలా ఆత్మభిషేకం నిండిఉంటుంది.

ఈయన శైలి సరళమే, స్వరం సునాయసమే,
సంగీతం సుమధురమే, దృశ్యం సువీక్షణమే,
పాటంతా సుభిక్షమే.

నేటి తరం యువతకు క్రీస్తుని రుచించే పాటల్లో ఈయన గారి రచనలుచెప్పుకోదగినవని చెప్పడంలో సందేహంలో అతిషయోక్తి అంతకంటే కాదు.

ఆయనే...
Bro.Bharath Mandru గారు.
మీ పలకరింపులో ఆత్మీయత మీ మాటలో దైవిక ప్రోత్సహం గౌరవించే మీ గొప్ప తగ్గింపు స్వభావమే ఆధ్యాత్మిక సాహిత్యఅభిషేకం ఇందుకు ప్రతిఫలం.
ఇంకా కలవలేదు మిమ్మల్ని ప్రత్యేక్షంగా కలిస్తే మనసునిండా నా బావల్ని అనుభవాల్ని మీతో పంచుకొని మంచి కాఫీ
తాగలనిఉంది.

ఎల్లప్పుడు మీతో కలిసి క్రీస్తు సంగీత సేవలో
మీ ఆత్మీయ తమ్ముడు
Devanand Saragonda
D-Titles
91103-12090

Address

Hyderabad

Telephone

+919110312090

Website

Alerts

Be the first to know and let us send you an email when Devanand Saragonda TITLE Artist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Devanand Saragonda TITLE Artist:

Share