05/10/2025
నీకు ఎంతమంది తెలుసు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు…
నువ్వు ఎంతమందికి తెలిసి ఉన్నావు అన్నదే నీ బిజినెస్‌లో అసలైన శక్తి.
నీ దగ్గర ఎంత గొప్ప ప్రొడక్ట్ ఉన్నా… ఎంత నాణ్యమైన సర్వీస్ ఉన్నా… ఒక విషయం మాత్రం నిజం—నువ్వు కనిపించకపోతే, నీ కస్టమర్ ముందే లేవు అన్నట్టే.
ఒక చిన్న పట్టణంలో సీత మరియు రమ్య అని ఇద్దరు కుట్టుమిషన్ పని చేసే మహిళలు ఉన్నారు.
సీత – అద్భుతమైన పనితనం తన సొంతం. ఆమె చేతిలో కుట్టిన డ్రెస్ వేసుకున్నవాళ్లందరూ ఆశ్చర్యపడి “ఇది ఎక్కడ కుట్టించావ్?” అని అడిగేవారు.
కానీ సీత గురించి ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే ఆమె ఇంట్లో కూర్చుని కుట్టేది. కస్టమర్లు తానే వెతికి రావాలని ఎదురుచూసేది.
అదే పట్టణంలో రమ్య ఉంది. ఆమె పనితనం అంత బాగుండేది కాదు. కానీ రమ్య ప్రతి వారం చిన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది:
👉 “పాత చీరను కొత్తగా ఎలా మార్చాలో”
👉 “ఒక సాధారణ చీరను పార్టీ డ్రస్‌గా ఎలా చేయాలో”
కొద్ది కాలంలోనే, పట్టణమంతా రమ్యను గుర్తుపెట్టుకుంది. కొత్త కస్టమర్లు వరుసగా ఆమె దగ్గరికి వచ్చేవారు.
సీత ఆశ్చర్యపోయింది:
“నా పని రమ్య కంటే పదింతలు బాగుంటే, కస్టమర్లు ఎందుకు ఆమె దగ్గరికి వెళ్తున్నారు?”
ఇక్కడే సీక్రెట్ ఉంది.
పనిలో నైపుణ్యం (Skill) కంటే ముందు Visibility.
రమ్య average అయినా, ఆమె కనిపించింది.
కనిపించడం వల్లే నమ్మకం వచ్చింది.
నమ్మకం వల్లే కస్టమర్లు వచ్చారు.
ఇక్కడ నేను చెప్పిన స్టోరీ కేవలం సీత మరియు రమ్య ల గురించి మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఇంటి దగ్గరనుండి చిన్న బిజినెస్ లు చేసే వారు, మరియు వారసత్వ వ్యాపారాలు నడిపే వారు, Wellness coaches, బిజినెస్ కోచ్ లు, Affiliate మార్కెటింగ్, ఇన్సూరెన్స్ , రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వారి అందరి గురించి. ఇప్పుడు సోషల్ మీడియా లో అందులోను వీడియో లో కనిపించడం ఎంతమాత్రం Optional కాదు అది తప్పనిసరి.
Principle:
👉 “Business is not about who you know, it’s about who knows you.”
నువ్వు నీ కస్టమర్ కి కనిపించకపోతే → నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా, మార్కెట్ చూడదు.
సోషల్ మీడియాలో కనిపిస్తే → నువ్వు Authorityగా మారే అవకాశం ఉంటుంది.
Consistencyతో కనిపిస్తే → కస్టమర్ మనసులో నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు నీ బిజినెస్‌లో ఇది ఎలా apply చేసుకోవాలి?
సోషల్ మీడియా లో వీడియో ద్వారా కనిపించు – టెక్స్ట్ పోస్టులు చదివే వారు కొంతమంది మాత్రమే. కానీ నీ ముఖం కనిపిస్తే → నమ్మకం డబుల్ అవుతుంది.
Consistency – 30 రోజులు వరుసగా విలువ ఇచ్చే వీడియోలు పోస్ట్ చేయి. 30 రోజులు నువ్వు కనిపిస్తే, నీ కస్టమర్ లు నిన్ను గుర్తించకపోవడాం అన్నది అసాధ్యం.
Trust → Leads → Sales
Visibility trustను తెస్తుంది. Trust leadsను తెస్తుంది. Leads salesగా మారతాయి.
🌟 ఒక్కటి మాత్రం నిజం మిత్రమా:
“కనిపించకపోతే బిజినెస్ అనే నది ఎండిపోతుంది. కనిపిస్తే, బిజినెస్ నిండు ప్రవాహంలా సాగుతుంది.”
అయితే ఇప్పుడు ఈ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా?
నేను కూడా మీ లాగే ఇప్పడు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కొన్నాను. నాకు చాలా సమయం పట్టింది మరియు డబ్బు కూడా ఖర్చు అయ్యింది. ఈ స్కిల్స్ నేర్చుకోవటానికి. ఒక చిన్న బిజినెస్ ఓనర్ గా నాలా మీరు కూడా ఇబ్బంది పడకూడదు అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యం గా తెలుగు బిజినెస్ ఓనర్స్ కోసం. నేను నేర్చుకున్న స్కిల్స్ కొంతమందికి నేర్పాలి అని. ఎందుకు అంటే నా కోచ్ నాకు ఒక్కటే చెప్పారు - నీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వడం వలన నువ్వు కోల్పోయేది ఏమీ ఉండదు, నువ్వు ఇచ్చిన దానికంటే పది రెట్లు ఎక్కువ నీకు తిరిగి వస్తుంది అని. నా పేరు Kishore Reddy Alla, Founder of "Freedom Business Launchpad" & Founder of DNM PROS Community .
ఇలాంటి ప్రయాణాన్ని ఒంటరిగా కాకుండా, ఒక communityలో చేస్తే growth వేరే స్థాయిలో ఉంటుంది.
మీరు కూడా ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడే Freedom Business Startup FB Groupలో జాయిన్ అవ్వండి . అక్కడ మీకు కావాల్సిన Guidance మరియు support దొరుకుతాయి.
అయితే ఇది అందరి కోసం కాదు, ఎవరైతే స్కిల్స్ నేర్చుకోవాలి నా బిజినెస్ పెంచుకోవాలి అనుకుంటున్నారో వారి కోసం మాత్రమే.
✍️ క్రింద కామెంట్‌లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా ఎటువంటి స్కిల్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారు అని.