Rajadhani Vartalu

Rajadhani Vartalu Breaking News from Capital Amarvati, AP, TS, National,International-rajadhanivartalu.com
9440662699 In print a weekly newspaper since Oct-2015.

PROFESSIONAL PROFILE

VASTITUDE MEDIA Pvt.Ltd: Founder & Managing Director - 2015 to till date
• Established a media house in 2015 to play an important role in print, digital & social media activities. Also publishing news on digital & social media plotforms like website, youtube, facebook & twitter. In addition conducting press briefs, business meet-ups
• Accredited Journalist from the government of Andhra Pradesh since 2015, Card no: SHQ-0664

RAJADHANI VARTALU: A print publication weekly
• Editor & Publisher of ‘Rajadhani Vartalu’, a Telugu weekly newspaper. First news weekly being published from Amaravati, Capital City of AP
• Publishing people’s problems & propagate government schemes to the people, thus being a catalyst in the development of AP. This 7-year-old weekly has won the appreciation from all sections of AP
• Distribution to AP secretariat & Assembly employees, Ministers, Officers and in local communities surrounding Mangalagiri, Guntur & Vijayawada

ONLINE
• Rajadhanivartalu.com - an online website, publishing daily news
• Social Media- Publish news on regular intervals on various platforms’ like facebook, youtube, twitter

INFORMATION TECHNOLOGY: 1999 - 2014
• NRI, Returned from America, Worked in Top software firms like Oracle America, NEC Electronics, Keane, Polycom & Top 5 consulting firms like Deloitte, Fox, Barclays Bank, Dolby Labs, HCMC, Wells Fargo & UTHCT
• Lived in USA for 14 years. Senior IT professional with PeopleSoft-Oracle implementation experience incorporating best business practices. Acted as a Liaison, recruited consultants for projects, helped clients at onsite, certified in ITIL with excellent communication and inter-personal skills

ACHIEVEMENTS, COMMUNITY SERVICE & INTERESTS
• Legal: Won the case thus, helped release INR 227 Cr. on Dec 27th from the government of AP to Engineering students of year 2019-2020 under Jagananna Vidyadeevena Fees Reimbursement Scheme by filing Public Interest Litigation(PIL) - 67 of 2021
• Helped build local prayer hall for Muslim welfare society of Rayapudi by donating Rs.15 lakhs
• Sponsored students education & make them the best citizens of the Nation
• Promote Education, Youth Training & Skill development
• Mentoring students on technology, guide them on the available jobs both at home & in USA
• Creating awareness on Human rights, Greenery, government schemes for the welfare of the people
• Despite previous government’s obstacles, helped in felicitating farmer’s grievances, assigned land owners, students & farm labors, bring the issues to the notice of govt. for amicable issue resolutions
• Lives in Rayapudi, which is in the core capital area of Amaravati, AP

OTHERS
• Founder of Amaravati Welfare Council, AP – NGO, now handed over to Sri Ramanuja Trust
• President, AP Chapter-All India Small&Medium News Papers Federation (AISMNF),New Delhi– 2019

24/08/2026

************
ఏపీడబ్ల్యూజేఎఫ్ అనంతపురం జిల్లా కమిటీ ఎన్నికలు
- రాష్ట్ర నాయకుల రాక
- జిల్లా వ్యాప్తంగా ప్రతి సభ్యుడు తరలి రండి
- ఏపీడబ్ల్యూజేఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు
**********************
ఆగస్టు 24(అనంతపురం):
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) అనంతపురం జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం ఉదయం 10 గంటలకు అనంతపురం నగరంలోని మెడికల్ కళాశాల పక్కన గల ఐఎంఏ హాల్లో జరుగుతాయని ఏపీడబ్ల్యూజేఎఫ్ అనంతపురం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాయలసీమ జిల్లాల ఇంచార్జ్ జయరాజు, ఎన్నికల అధికారి తలారి రామాంజినేయులు పర్యవేక్షణలో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీడబ్ల్యుజేఎఫ్ లో సభ్యత్వమున్న ప్రతి జర్నలిస్టు తప్పకుండా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏపీ గ్రామాల్లో మైనింగ్ మాఫియా అరాచకాలురాయల్టీ పేరుతో రైతుల నుంచి అక్రమ వసూళ్లు, ఫేక్ క్యూఆర్ (QR) పర్మిట్ల కుంభకోణంరాజధా...
24/08/2026

ఏపీ గ్రామాల్లో మైనింగ్ మాఫియా అరాచకాలు
రాయల్టీ పేరుతో రైతుల నుంచి అక్రమ వసూళ్లు, ఫేక్ క్యూఆర్ (QR) పర్మిట్ల కుంభకోణం

రాజధాని వార్తలు, విజయవాడ:
ఆంధ్రప్రదేశ్‌లో రాయల్టీ వసూళ్ల ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న నిలువు దోపిడీ, గ్రామగ్రామానికి విస్తరించిన మైనింగ్ మాఫియా అరాచకాలను తీవ్రంగా ఖండిస్తూ సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు
ఏ.బి. వెంకటేశ్వర రావు, నల్లమోతు చక్రవర్తి , అజయ్ మళ్ళా రెడ్డి, ఎదురూరి శ్రీనివాస్ రెడ్డి నేడు 24/08/2026, సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. రాయల్టీ వసూళ్ల కాంట్రాక్టు దక్కించుకున్న ప్రైవేట్ ఏజెన్సీలు (ముఖ్యంగా M/s AMR ఇండియా లిమిటెడ్) అడ్డగోలుగా బౌన్సర్లను మోహరించి, గ్రామాల్లో అనధికారిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రైతులు, సామాన్యులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని వక్తలు ఆధారాలతో సహా వివరించారు.

1. రైతులు, గ్రామీణులపై సాగుతున్న దోపిడీ
రైతులపై జులుం: రాయల్టీ అనేది వాణిజ్యపరమైన క్వారీ లీజులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ, రైతులు తమ సొంత పొలాల్లో మెరక నుంచి పల్లానికి మట్టిని తోలుకున్నా, ఇళ్ల మరమ్మతుల కోసం మట్టిని తరలించుకున్నా... ప్రైవేట్ ఏజెన్సీ బౌన్సర్లు ట్రాక్టర్లను అడ్డుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది మైనింగ్ రూల్స్ 10-C కి పూర్తిగా విరుద్ధం.

ఫినిష్డ్ గూడ్స్‌పై అక్రమ వసూళ్లు: మైనింగ్ చట్టాలకు విరుద్ధంగా, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న ఫినిష్డ్ ప్రొడక్ట్స్ (ఉదాహరణకు గ్రానైట్ టైల్స్) వాహనాలను కూడా రోడ్లపై అడ్డగించి దౌర్జన్యంగా డబ్బులు లాగుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం:
ఈ దౌర్జన్యాలపై రైతులు, వాహనదారులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

2. వందల కోట్ల కుంభకోణం - సమాంతర (Fake) క్యూఆర్ సిస్టమ్
ప్రభుత్వ పోర్టల్‌కు గండి: ప్రభుత్వ అధికారిక 'OMEPS' పోర్టల్ ద్వారా కాకుండా, ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఒక సమాంతర ప్రైవేట్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించి అనధికారికంగా "VSKP/VSP" సిరీస్‌లో ఫేక్ క్యూఆర్ (QR) కాగితపు స్లిప్పులు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్రెస్ నోట్‌కి జతచేసిన అనకాపల్లి మైనింగ్ డిపార్ట్‌మెంట్ తనిఖీ రిపోర్ట్ ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.

భారీ పన్ను ఎగవేత: ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును ప్రభుత్వానికి (Seigniorage, DMF, MERIT తదితర పన్నులు) కట్టకుండా నేరుగా తమ జేబుల్లో వేసుకుంటూ భారీ ఎత్తున ఖజానాకు గండి కొడుతున్నారు.

ప్రభుత్వం ముందుంచుతున్న మా ప్రధాన డిమాండ్లు:
తక్షణ అరెస్టులు: గ్రామాల్లోకి చొరబడి రైతులను, సామాన్యులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రతినిధులు, బౌన్సర్లను వెంటనే అరెస్టు చేయాలి.

అక్రమ చెక్‌పోస్టుల తొలగింపు: రోడ్లపై ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన అనధికారిక చెక్‌పోస్టులను తక్షణమే తొలగించాలి. తనిఖీలు కేవలం అధికారిక క్వారీల వద్ద మాత్రమే జరగాలి.

కాంట్రాక్ట్ రద్దు & విచారణ:
అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీ కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి, ఈ భారీ కుంభకోణంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.

ప్రజలకు మేమిస్తున్న సందేశం / పిలుపు:
AMR కు రోడ్డు మీద డబ్బు వసూలు చేసే అధికారం లేనే లేదు, క్యాష్ వసూలు చేసే అధికారం అసలే లేదు. లైసెన్స్ ఉన్న మైన్ నుంచి బయటకు వచ్చే వాహనాలు తప్ప ఎవరినీ ఆపే అధికారం లేదు.

ఈ గూండాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునే హక్కు మీకు ఉంది. గూండాలు చెరువులో, పొలంలో నుంచి వచ్చే మట్టి ట్రాక్టర్లు ఆపితే పక్కకు తోసేసి ముందుకెళ్ళిపోండి.

అవసరం, వీలు ఉంటే తోటి గ్రామస్థుల సహాయం తీసుకోండి. వాళ్లకు కూడా మిమ్మల్ని రక్షించే హక్కు ఉంది.

ఇంకా ఎక్కువ చేస్తే ఆ గూండాలను అదుపులోకి తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్‌లో అప్పగించండి.

ఇవేవీ పనిచేయని పక్షంలో మాకు ఫోన్ చెయ్యండి. మేము వస్తాం, మీకు అండగా నిలబడతాం.
📞 హెల్ప్‌లైన్ నంబర్: 99595-03355

జతపరచిన ఆధారాలు / పత్రాలు:
అనకాపల్లి DM&GO ఆకస్మిక తనిఖీ నివేదిక (తేదీ: 15.05.2026): అనకాపల్లి జిల్లా సంపతిపురం చెక్‌పోస్టులో ప్రైవేట్ వ్యక్తులు అనధికారిక "VSKP/VSP" పర్మిట్లు ఇస్తూ అక్రమ నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని స్వయంగా మైనింగ్ అధికారులే ధృవీకరించి ఇచ్చిన నివేదిక.

APMMC రూల్ 10-G (మైనింగ్ నిబంధనలు): కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ కూపన్లు జారీ చేయకూడదని, కేవలం అధికారిక పరిమితుల మేరకే వ్యవహరించాలని తెలిపే చట్టపరమైన నిబంధన.

టెండర్ కండిషన్ (సెక్షన్ 11.4): క్వారీ లీజు లేని వ్యక్తుల (రైతుల) నుంచి, అలాగే ప్రాసెస్ చేసిన ఫినిష్డ్ ప్రొడక్ట్స్ పైన రాయల్టీ వసూలు చేయకూడదని స్పష్టంగా ఉన్న టెండర్ నిబంధనలు.

కాంట్రాక్ట్ అగ్రిమెంట్ (Schedule-II, తేదీ 08.10.2025): AMR సంస్థ కేవలం లీజ్ మైన్ల దగ్గర మాత్రమే బిల్లు తనిఖీలు చెయ్యాలి అని ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద పత్రం.

ఫేక్ క్యూఆర్ (QR) కోడ్ పర్మిట్: ప్రభుత్వ వ్యవస్థకు (OMEPS) సంబంధం లేకుండా అనధికారిక చెక్‌పోస్టులో జారీ చేసిన పర్మిట్ స్లిప్ కాపీ.

23/08/2026

సంగీత సాహిత్యాలతో అలరించిన 'సృజనోత్సవం’

రోజంతా సాహిత్య సాంస్కృతిక సందడి

మహాత్మాగాంధీ రోడ్- ఠాగూర్ గ్రంథాలయ ఆడిటోరియం వేదిక

రెండు తెలుగు రాష్ట్రాల నుండి హాజరైన కవులు, కళాకారులు

శతాధిక కవుల ఆత్మీయ సంగమం

తెలుగుభాష, పర్యావరణం, సంస్కృతి సంప్రదాయాలపై కలమెత్తిన కవులు

సాహిత్యానికి తోడుగా రాగాలాలపించిన గాయకులు

కూచిపూడి నృత్యంతో అలరించిన చిన్నారులు

మల్లెతీగ-గిడుగు సేవా పురస్కారాలందుకున్న సాహిత్య, సాంస్కృతిక సేవాసారధులు

శతాధిక కవులకు శాలువా, జ్ఞాపికతో కవి సత్కారం

ప్రముఖ రచయితల మూడు పుస్తకాలు ఆవిష్కరణ

సృజనోత్సవం వంటి వినూత్న కార్యక్రమాలు సాహిత్య సాంస్కృతిక రంగాన్ని మరింత సజీవం చేస్తాయని వక్తలు కొనియాడారు. సాహిత్య సాంస్కృతిక సారధులను ప్రోత్సహిస్తూ, భాష సంస్కృతులను మరింత మెరుగు పరచే దిశగా మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆదివారం విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో 'సృజనోత్సవం' కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని గిడుగు రామమూర్తి పంతులు మునిమనవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు అతిథిగా హాజరై జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. సభాధ్యక్షులుగా సుప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ- సాహితీమూర్తుల్ని, కళాకారుల్ని ప్రభుత్వం గుర్తిస్తున్నప్పటికీ అందరినీ గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి సామాజిక బాధ్యతతో మల్లెతీగ వంటి సంస్థలు ముందుకొచ్చి గిడుగు వారి పేరుతో పురస్కారాలివ్వడం అభినందించాల్సిన విషయమన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ- నేటి యువతలో పుస్తక పఠనం, కవిత్వం, సంగీతం, సాంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం వుందని, ఆ దిశగా సృజనోత్సవం వంటి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.
ఆంధ్ర నాటక కళాసమితి వ్యవస్థాపకులు నన్నపనేని నాగేశ్వరరావు, సుప్రసిద్ధ రచయిత డా. యం.ప్రభాకర్, సుప్రసిద్ధ కవి, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ సలహాదారులు చిన్ని నారాయణరావు, ఠాగూర్ గ్రంథాలయ గ్రేడ్ 1 గ్రంథ పాలకురాలు శ్రీమతి కె. రమాదేవి సీనియర్ జర్నలిస్టు ఘంటా విజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. పైనేని తులసీనాధం నాయుడు(చిత్తూరు జిల్లా), షేక్ కరీముల్లా (పల్నాడు జిల్లా), డా. తూములూరి రాజేంద్రప్రసాద్ (గుంటూరుజిల్లా), విల్సన్ రావు కొమ్మవరపు (ఎన్టీఆర్ జిల్లా), రేపాక రఘునందన్ (ఎన్టీఆర్ జిల్లా), జ్యోతి మువ్వల (విశాఖపట్నం), శ్రీమతి ఎం. వరలక్ష్మీ కళ్యాణి (గుంటూరు జిల్లా), డా. వి. రఘుపతి (చిత్తూరు జిల్లా), డా. టి. పార్ధసారధి (ఏలూరు జిల్లా), వసుధ బసవేశ్వరరావు (కృష్ణాజిల్లా)లకు మల్లెతీగ -గిడుగు పురస్కారాలను అందజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 130 మంది కవులు తెలుగుభాష, పర్యావరణం, సంస్కృతి సంప్రదాయాలపై కవితా పఠనం చేశారు. కార్యక్రమ ప్రారంభంలో 'కళాక్షేత్ర ది డాన్స్ అకాడమీ' నిర్వాహకులు ఎ. గీత, పి. మౌనిక శిష్యబృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు, గాయకులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. 'అంతరంగ వీక్షణం', 'నిడదవోలు చరిత్ర', 'విశ్వకవి సమ్రాట్' మూడు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వ్యాఖ్యాతగా శ్రీమతి వంగిపురపు శారద వ్యవహరించగా సభను మల్లెతీగ వ్యవస్థాపకుడు కలిమిశ్రీ పర్యవేక్షించారు.

సంగీత సాహిత్యాలతో అలరించిన 'సృజనోత్సవం’ రోజంతా సాహిత్య సాంస్కృతిక సందడిమహాత్మాగాంధీ రోడ్- ఠాగూర్ గ్రంథాలయ ఆడిటోరియం వేది...

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన*

*ఉపరాష్ట్రపతితో కలిసి మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్న సీఎం*

*అమరావతి, ఆగస్ట్ 23 😗 రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్‌తో మార్కెట్‌కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరు వేదిక కానుంది. దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు. ఏలూరు జిల్లా జిల్లా ముసునూరులో గోర్మే పాప్‌ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యు పరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించనున్నారు. గోర్మే పాప్‌కార్నికా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మెయిజ్ సాగుతో వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముసునూరులోని ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా నిర్మించారు. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేయడంలో సంస్థ కీలకంగా ఉంది. సోమవారం తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు.

*ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు*

ఉదయం 09.55 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.15 గంటలకు ముసునూరు మండలం, కాట్రేనిపాడుకు చేరుకుంటారు. 10.45 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి ఆయన, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కు స్వాగతం పలుకుతారు. 11.00 గంటలకు హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 01.20 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
*******

Address

6-45/1
Guntur
522237

Opening Hours

Monday 8:30am - 9pm
Tuesday 8:30am - 9pm
Wednesday 8:30am - 9pm
Thursday 8:30am - 9pm
Friday 8:30am - 9pm
Saturday 8:30am - 9pm
Sunday 8:30am - 9pm

Telephone

+919440662699

Alerts

Be the first to know and let us send you an email when Rajadhani Vartalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajadhani Vartalu:

Shortcuts

Share