23/02/2026
సంగడిగుంట బిర్యాని సెంటర్‌పై ఆరోపణలు తీవ్రం – నాసిరకం ఆహారం విక్రయం?
గుంటూరు నగరంలోని సంగడిగుంట ప్రాంతంలో ఉన్న ఓ బిర్యాని సెంటర్‌పై ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పటికే (కబరస్థాన్) స్మశాన వాటికలో ఉపయోగించిన కర్రలను వంటకు వినియోగిస్తున్నారనే ఆరోపణల మధ్య, రెస్టారెంట్‌లో గడ్డకట్టిపోయిన, దుర్వాసన వచ్చే నాసిరకం మాంసాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తులు హోటల్ యజమానిని ప్రశ్నించగా వాడితే ఏమైద్ది అనే వింత పోకడలు వెళ్లే సమాధానం ఇస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుండగా, ప్రజలు ఆహార భద్రత అధికారులతో పాటు సంబంధిత శాఖలు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
guntureastconstituency