Greater Guntur news

Greater Guntur news *Add a description with basic info for Cherukuri ADS.

ఆంధ్ర రాష్ట్ర సమాచార కమిషనర్ గౌరవనీయులు శామ్యూల్ జోనాథన్ గారికి హృదయపూర్వక అభినందనలు మీ చెరుకూరి శ్రీనివాస్
26/11/2022

ఆంధ్ర రాష్ట్ర సమాచార కమిషనర్ గౌరవనీయులు శామ్యూల్ జోనాథన్ గారికి హృదయపూర్వక అభినందనలు మీ చెరుకూరి శ్రీనివాస్

15/11/2022
మిత్రులారా.... చాలా విషాదకర వార్త.  తెనాలి మండల గ్రామమైన బుర్రిపాలెం గ్రామానికి చెందిన మా బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్...
15/11/2022

మిత్రులారా.... చాలా విషాదకర వార్త. తెనాలి మండల గ్రామమైన బుర్రిపాలెం గ్రామానికి చెందిన మా బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్, ఆంధ్ర జేమ్స్ బాండ్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు ఈరోజు (15-11-2022 ) తెల్లవారు ఝామున 04 గంటలకు అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్ను మూసారు. తెనాలి సమీపాన కల బుర్రిపాలెం గ్రామానికి చెందిన వారు కావడంతో తెనాలితో ఎనలేని అనుబంధం ఉంది. వారిని ప్రజాశక్తి పత్రికలో తెనాలి లో వర్క్ చేసినప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగింది. తెనాలి తాలూకా హై స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. ఎనిమిదవ తరగతి నుండి తెనాలిలో విద్యా భాసం చేసేటప్పుడు తన తోటి మిత్రులు మునిసిపల్ పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేసిన శ్రీ ఘట్టమనేని వెంకటప్పయ్య, తెనాలి సినిమా థియేటర్స్ లో సీనియర్ ఆపరేటర్ గా పనిచేసిన మోటుపల్లి కృష్ణబాబు ముగ్గురూ కలసి సైకిళ్లపై తెనాలి వచ్చి చదువుకునే వారు. తెనాలి కొత్తపేటలోని ములుకుట్లవారి వీధిలో ములుకుట్ల లక్ష్మీ నారాయణ అనే ఉపాధ్యాయుని వద్ద ఈ ముగ్గురు మిత్రులు ఆంగ్లం, గణితం పాఠాల నిమిత్తం ట్యూషన్ కు వచ్చేవారు.
సూపర్ స్టార్ కృష్ణ తన జన్మస్థలమైన బుర్రిపాలెం గ్రామంలో అనేక చిత్రాలు నిర్మించారు. మీనా, పాడిపంటలు, ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, రైతు భారతం,ఇత్యాది అనేక చిత్రాలను నిర్మించి ఈ ప్రాంతంలో సందడి చేసారు. ప్రజారాజ్యం, ఈనాడు చిత్రాలలో కొన్ని సన్నీవేశాలు తెనాలి చిత్రీ కరించారు. తెనాలి ఆషా సినిమా థియేటర్ ప్రారంభోత్సవం చేశారు. ఇలా వారితో మా తెనాలి ప్రజలకు ఎనలేని అనుబంధం ఉంది.
1965 లో తేనే మనసులు చిత్రం తో హీరోగా సినీ రంగప్రవేశం చేశారు. సాహసానికి ప్రతిరూపమైన సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం 1978 నుండి 1985 మధ్య కాలం పీక్ స్టేట్ అని చెప్పవచ్చు. ఒక దశలో తెనాలిలోని అన్ని సినిమా హాళ్లలో కృష్ణ గారు నటించిన సినిమాలు మాత్ర్రమే ప్రదర్శనకు నోచుకోవడం విశేషం. వారు తెలుగు లో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజూగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. సింహాసనం పేరుతో అయన దరర్శకత్వం వహించి, నటించిన తెలుగులో తోలి 70 ఎంఎం చిత్రం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. అయిదు దశాబ్దాల సినీ జీవితంలో మొతం 350 చిత్రాలలో కృష్ణ నటించారు. 1965 లోఆయన నటించిన తేనెమనసులు తొలి చిత్రం కాగా 2016 లో విడుదలైన `శ్ర్రీశ్రీ` కృష్ణగారు నటించిన చివరి సినిమా. లెక్క లేనన్ని అవార్డుతో రివార్డులు అందుకున్న నటశేఖర కృష్ణ భారత ప్రభుత్వం నుండి 2009 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తూ అశ్రు నివాళి.....

*గ్రేటర్ గుంటూరు న్యూస్*
*ఎడిటర్ చెరుకూరి శ్రీనివాస్*

నేడు ప్రపంచం లో సాంకేతిక పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ..నేటి యుగంలో సంపాదనే ధ్యేయంగా ఉన్న పరిస్తితి లో నిరంతరం కష్ట...
06/10/2022

నేడు ప్రపంచం లో సాంకేతిక పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ..నేటి యుగంలో సంపాదనే ధ్యేయంగా ఉన్న పరిస్తితి లో నిరంతరం కష్టపడి సంపాదించి తన కున్న యావదాస్తిని..డాక్టర్ గా తన కష్టార్జితాన్ని సర్వ ఆస్తిని తను చదువుకున్న గుంటూరు వైద్య కళాశాల ఆసుపత్రికి 20 కోట్ల రూపాయలను విరాళం ప్రకటించిన మూర్తీభవించిన మహిళా మూర్తి ఆమె డాక్టర్ ఉమ గవిని.
--------- ---------
అమెరికా లో స్థిరపడి డాక్టర్ ఉమ గౌనీ..గుంటూరు లోని మెడికల్ కాలేజి 1965 లో యంబిబియస్ పూర్తి చేసింది.అమెరికాలో ఇమ్మునాల్గిస్ట్ గా అమెరికాలో స్థిరపడ్డారు.తను చదువుకున్న కాలేజి పై ఉన్న అపారమైన ప్రేమతో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సహృదయం తాను సంపాదించిన 20 కోట్లు (2.5 లక్షల డాలర్లు) ను జీజీహెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న భవనానికి విరాళం గా ప్రకటించారు.అమెరికా లోని డల్లాస్ లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్ధుల సంఘం ఉత్తర అమెరికా 17 వ రీ యూనియన్ సమావేశం లో తాను పాల్గొని వైద్య కళాశాల ఆసుపత్రికి విరాళం ప్రకటించారు.
బ్యాంక్ లాకర్లో కోట్లు కోట్లు దాచుకొనే ఈ రోజుల్లో తన బ్యాంక్ ఖాతాలో ఒక్క డాలర్ కూడా లేకుండా తాను తన భర్త నుంచి వచ్చిన ఆస్తిని విరాళం గా ప్రకటించటం పలువురు ప్రశంసించారు. జీజీహెచ్ లోని యంసిహెచ్ బ్లాక్ కు ఆమె పేరు పెడతామని సూచించారు.ఆమె సున్నితం గా తిరస్కరించారు.పలువురు వత్తిడి మేరకు తన భర్త డాక్టర్ కానూరి రామ చంద్ర రావు పేరు పెట్టాలని నిర్ణయించారు. ఆమె భర్త డాక్టర్ కానూరి కర్ణాటక లోని గుల్బర్గా లో మెడిసిన్ లో ఏనాస్తిస్తిట్ గా సేవలు అందించారు గత మూడు సవత్సరాలు క్రితం పరమమోప దించారు.
*డాక్టర్ ఉమ గవిని స్ఫూర్తి తో విరాళాలు ప్రకటించిన పలువురు వైద్యులు*

డాక్టర్ మువ్వా వెంకటేశ్వర్లు 20 కోట్లు,డాక్టర్ సూరపనేని కృష్ణ ప్రసాద్ 8 కోట్లు,తెల్ల నళిని దంపతులు 8 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

గత రెండు దశాబ్దాలుగా పైగా నేను ప్రజాశక్తి లో వర్క్ చేసినప్పుడు టీవీ9 రజనీకాంత్ excutive director గా పని చేస్తూ..తెలుగు ర...
28/09/2022

గత రెండు దశాబ్దాలుగా పైగా నేను ప్రజాశక్తి లో వర్క్ చేసినప్పుడు టీవీ9 రజనీకాంత్ excutive director గా పని చేస్తూ..తెలుగు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాలలో సీనియర్ జర్నలిస్ట్ ప్రశంసలు పొందుతూ..నాకు చాలా ఆత్మీయులు గా స్నేహశీలి గా ఉన్నారు..కాగా వారి తల్లి గారు మరణం వారికి వారు కుటుంబానికి తీరని లోటు..ఈ సందర్భంగా గుంటూరు లోని బండ్లమూడి గార్డెన్స్ లో జరిగిన సంతాప సభలో వారిని కలిసిన దృశ్యం...
గ్రేటర్ గుంటూరు న్యూస్
Editor cherukuri srinivas

28/09/2022

సీనియర్ జర్నలిస్ట్ TV 9 excutive director రజనీ కాంత్..గత 2దశాబ్దాల నుంచి నేను ప్రజాశక్తి లో పని చేస్తున్న అప్పటి నుంచి బాగా స్నేహశీలి గా ఉన్నారు..వారి తల్లి గారు శ్రద్ధాంజలి తెలుపుతూ..కలిసి నప్పటి దృశ్యం...

మహా కవి జాషువా పురస్కార అవార్డు ను ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు,శ్రీ గుంటూరు లక్షి నరసయ్య గారికి జాషువా నిర్వ హణ అవా...
26/09/2022

మహా కవి జాషువా పురస్కార అవార్డు ను ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు,శ్రీ గుంటూరు లక్షి నరసయ్య గారికి జాషువా నిర్వ హణ అవార్డ్ అధినేత శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ గారు అతి రధ మహులు శ్రీయుతులు మంత్రి వర్యులు అంబటి,Mp కృష్ణ దేవరాయ సీనియర్ MLC ఉమ్మారెడ్డి వంకటేశ్వర్లు MLC జంగా కృష్ణ మూర్తి తదితరులు చేతుల మీదుగా అందించారు..లక్ష్మి నరసయ్య గారు గత 15 యేళ్లు నుంచి మంచి మిత్రుడు కావటంతో పాటు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

Greater guntur news ప్రతి సంచిక ప్రత్యేకతే...
22/01/2021

Greater guntur news ప్రతి సంచిక ప్రత్యేకతే...

,Greater guntur magzine month of November inagaration by minister srimathi sucharitha MLA maddali and ex MP modugula ..e...
21/11/2020

,Greater guntur magzine month of November inagaration by minister srimathi sucharitha MLA maddali and ex MP modugula ..edtior by ch Srinivas.

08/03/2020
ప్రతి నెల..రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషణ లు అందిస్తూ... నూతన వరవడితో..ముందుకు పోతున్న గ్రేటర్ గుంటూరు పాఠకుల...
08/03/2020

ప్రతి నెల..రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషణ లు అందిస్తూ... నూతన వరవడితో..ముందుకు పోతున్న గ్రేటర్ గుంటూరు పాఠకులకు...ఆదరిస్తున్న ప్రకటన దారులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. ఎడిటర్...చెరుకూరి శ్రీనివాస్

Address

Ram Murthy Enclave, Ftlat No. 1, Brundavan Gardens, 7th Line
Guntur
522006

Telephone

9885953221

Website

Alerts

Be the first to know and let us send you an email when Greater Guntur news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share