07/07/2024
కులమే ఓ శాపం..
వివక్ష.. ఎక్కడైన.. ఎప్పుడైన.. ఉంది..
మనిషి ఎంత ఎదిగిన.. తన మెదడులో , ఆలోచనలో మార్పు రావడం లేదు..
క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో కూడా.. ఇన్ని దారుణాలు, కుల వివక్షలు జరిగితే.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులకే రక్షణ లేకపోతే.. అనగారిన వర్గాలకు ఎక్కడ రక్షణ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ ఉదాంతం చూస్తే చాలా బాదేసింది.
దళితులు ఎంత చదువుకున్న, ఎంత పెద్ద స్థాయి ఉన్నత ఉద్యోగాలు వెలగబెట్టిన.. ఎంత స్థాయికి ఎదిగిన కుల రక్కసి నుంచి కోరల నుంచి బయటపడలేకపోతున్నారు. వేదింపుల నుంచి బయటపడలేకపోతున్నారు.
ఎంతో భౌవిష్యత్ ఉన్న ఒక ఎస్సై తోటి ఉద్యోగులు, పై అధికారులు కుల వివక్షతో వేదింపులకు గురి చేస్తే భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎందుకు ఇంత కులవివక్ష, వేదింపులు.. దేని కోసం.. దళిత సామాజిక వర్గంలో పుడితే వారు మనుషులు కాదా..?
నా 20 ఏండ్ల జర్నలిస్టు జీవితంలో నేను కులవివక్ష ఎదుర్కోన్నాను. చాలా శాఖల్లో దళిత ఉద్యోగులపై వివక్ష చూపుతూ.. వేదింపులకు గురి చేసిన సంఘటనలు చూశాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. సిరిసిల్ల నియోజకవర్గంలో పోలీస్ శాఖలో ఒక్క దళిత అధికారి లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు ఖాళీ చేయిస్తూ.. బదిలి చేయిస్తున్నాడు. తనకు అనుకున్న సామాజిక వర్గాల అధికారులను తెచ్చిపెట్టుకుంటున్నాడు.
దళితులు అంటేనే లా అండ్ అర్డర్ చేయరాదు, కరెప్షన్ అనే ఒక చెడు ముద్రను వేసి.. తమ పైసాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
రాజకీయ నాయకులు చెబితే వినకపోతే పోలీసు అధికారులను బదిలి చేయడమే.. లేకుంటే.. ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయడమే..
మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్బుతాలు సాధిస్తున్నాడు. కానీ కుల మతాల ఉచ్చులో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే ఏ కులం ఐతే ఆ కులం పోలీసు అధికారులు విధులు నిర్వహించాలే..నెల నెల టార్గెట్లు పెట్టుకొని.. వసూళ్లు చేయాలే.. ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అమ్యాయాలు ముట్టజెప్పాలే.. వారు చెప్పిన పని చేయాలే.. ఎవరి మీద అక్రమ కేసుల పెట్టమంటే పెట్టాలే ఇది రాష్ట్రంలో జరుగుతున్న తతంగం.
పోలీస్ శాఖ లో అధికారులు తమకు జరిగిన ఆన్యాయం బయటకు చెప్పకుందామన్న క్రమశిక్షణ అడ్డు వస్తది. పేరుకు క్రమశిక్షణకు మారు పేరు పోలీస్ శాఖ. ఎంతో మంది అభాగ్యులు.. ఇటువంటి వేదింపులకు, వివక్షకు గురౌతున్నారు. దళిత సామాజిక వర్గాలకు చెందిన పోలీసు అధికారులు ఏండ్ల తరబడి లూప్ లైన్లలో పడి ఏడుస్తున్నారు. చాలా మందికి పోస్టింగ్ లు లేవు. పోస్టింగ్ లు చేయాలంటే ఆ నియోజకవర్గం ప్రజాప్రతినిధికి మాముళ్లు ఇచ్చుకునే శక్తి ఉండదు. ఒక వేళ మాముళ్లు అప్పు తెచ్చి ఇచ్చిన.. అడ్డమైన పనులు చేయాలి.. పేదోడి కడుపు కొట్టి సంపాదించాలి అని చాలా మంది పోలీస్ అధికారులు లూప్ లైన్లకే పరిమితం అవుతున్నారు.
నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించే నాయకులు చెప్పిందే వేదం.. పోలీసు అధికారులు వారి కింద సుంకరి బతుకు వెల్లదీయాలే..
పోలీసు శాఖ మీద రాజకీయ నాయకుల అజమాయిషి ఎక్కువడంతో కూడా చాలా ఇబ్బందులు ఎదురౌవుతున్నాయి. పోలీస్ శాఖ పై రాజకీయ నాయకుల అతి జోక్యం ఎప్పటికి మంచిది కాదు. గత సర్కార్ లో ఎమ్మెల్యేలు లెటర్లు ఇస్తేనే పోలీస్ పోస్టింగులు అని చెత్త చెత్త చేసిండ్రు.. అందినకాడికి ఎమ్మెల్యేలు దంచుకోని .. పోలీసులను లంచగొండ్లుగా తయారు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిక అదే సిస్టంను ఫాలో అవుతున్నారు. కులం ప్రతిపాదికన.. ఆ నియోజకవర్గ రాజకీయ నేత చెప్పిన సామాజకి వర్గాలకే, అగ్రవర్ణాలకే పోస్టింగులు ఇస్తూ.. దళిత పోలీసు ఆపీసర్లను లూప్ లైన్లకు పంపించడం చర్చించదగిన విషయం.
సీఎం Anumula Revanth Reddy గారు పోలీసు శాఖ లో ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు నివారించాలి. అనగారిన వర్గాల్లో పుట్టి కష్టపడి చదువుకొని వచ్చి ఉద్యోగాలు సాధించి.. కుల వివక్షకు, పై అధికారుల వేదింపులకు గురై ప్రాణాలు వదులుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కులరక్కసిని తరిమివేయాలి.
కులం ప్రతిపాధికన పోస్టింగులు, ఎమ్మెల్యేల సిపార్సుల పోస్టింగులే కాకుండా ప్రతిభ ఆధారంగా నిజాయితి గల పోలీసు అధికారులందరికి పైసా ఖర్చు లేకుండా పోస్టింగ్ లు ఇచ్చే విధంగా చర్చలు తీసుకోవాలి.
ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య బాధాకరం. ఆశ్రునివాళి..
ఎస్సై శ్రీనివాస్ మరణంపై తెలంగాణా ప్రభుత్వ స్పందించి బాద్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
ఒక మనిషి మరణించే ముందు మరణవాంగ్మూలం కంటే పెద్ద సాక్ష్యం ఏది ఉండదు.. శ్రీనివాస్ వాంగూల్మంలో చెప్పిన పేర్లను అన్నింటిని పరిగణంలోకి తీసుకోని అందరిపు హత్య కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేయాలి