Aanvi Media

Aanvi Media A world class firm providing an array of services - Social Media Management, Digital Marketing, PR Management & Campaign Management.

Headquartered in London, U.K. Our Team Members have worked as Campaign Managers, P.R Managers, Political/strategy Analysts

29/04/2026


TVK will win with anti incumbency and Vijay will become CM.
DMK: 65-75
AIADMK: 45-55
TVK: 100-120

Assam Exit Polls. BJP will comfortably retain power. NDA = 85-95.UPA = 27-34.Others = 0-5.
29/04/2026

Assam Exit Polls.
BJP will comfortably retain power.
NDA = 85-95.
UPA = 27-34.
Others = 0-5.

    Exit poll by  Congress candidate Sri V. Naveen Yadav will win by a margin of 8000-9500 votes.Strong Poll Management,...
11/11/2025


Exit poll by
Congress candidate Sri V. Naveen Yadav will win by a margin of 8000-9500 votes.
Strong Poll Management, Extensive Door to door Campaign, Candidate Personal Votebank, support from minority voters turned the tide towards Congress.

Anumula Revanth Reddy Telangana Congress

యాదగిరిగుట్టకు ఐజీబీసీ గుర్తింపుశ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) గుర్...
18/10/2022

యాదగిరిగుట్టకు ఐజీబీసీ గుర్తింపు

శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) గుర్తింపు లభించింది.

మూలవరులను ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిలతో ప్రధానాలయ పునర్నిర్మాణం, కొండచుట్టూ పచ్చదనం, నీటిశుద్ధి నిర్వహణ, విద్యుత్తు వినియోగం, ప్రసాదాల తయారీపై 2022- 2025 సంవత్సరానికిగాను ఐజీబీసీ గ్రీన్‌ ప్లేసెస్‌ ఆఫ్‌ వర్షిప్‌ రేటింగ్‌ సిస్టం కింద సర్టిఫికెట్‌ వరించినట్టు ఆ సంస్థ ప్రతినిధి ప్రవీణ్‌ తెలిపారు.

ఈ నెల 20న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. గౌరవప్రదమైన సర్టిఫికెట్‌ను వైటీడీఏ అధికారులు అందుకోనున్నారు. వర్షపు నీటిన ప్రత్యేకమైన కాల్వల ద్వారా చెరువులకు మళ్లించే స్టామ్‌ వాటర్‌ డ్రైన్‌ పద్ధతితో పాటు అధునాతన ట్యాప్‌, పైపుల వినియోగం, డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్న విధానం బాగున్నదని ప్రవీణ్‌ అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా 100% ఎల్‌ఈడీ లైట్ల వినియోగం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.

అచ్చ తెలంగాణ సాంప్రదాయం , ఆడబిడ్డకు సారె పొయ్యడం !**********************************************************************...
03/10/2022

అచ్చ తెలంగాణ సాంప్రదాయం , ఆడబిడ్డకు సారె పొయ్యడం !
*************************************************************************************************
ఆకాశం విరిగిందా , పువ్వుల వాన కురిసిందా , జన సంద్రం కదిలిందా , బతుకమ్మ ల అభిషేకం తో పుడమి పులకరించిందా
తెలంగాణ గడ్డ మీద కాదు, ప్రవాస తెలంగాణ బిడ్డల బతుకమ్మ పండుగ కోలాహలం బ్రిటిష్ గడ్డ మీద

జగత్ సత్యం , జనమెరిగిన నిజం , మరోసారి ప్రభంజనం !
కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం లో స్థాపించన సాంస్కృతిక స్థాపిత జాగృతి సంస్థ , తెలంగాణ జాగృతి ముఖ్య లక్ష్యం సంస్కృతి సంప్రదాయాలను, పండుగలను తెలంగాణ విశిష్టతను ప్రపంచానికి సగర్వాంగా చాటి చెప్పడం , తెలంగాణ జాగృతి విదేశాలలో మొట్టమొదటి సారిగా మొదలైంది యునైటెడ్ కింగ్డమ్ లో , జాగృతి సంస్థ లక్ష్యాన్ని యుకె లో, అధ్యక్షులు శ్రీ సుమన్ రావు బల్మురి అద్వర్యం లో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తూ , 6 వ సంవత్సరం ఘనంగా బతుకమ్మ వేడుకలు లండన్ లో ని ఇల్ఫోర్డ్ లో జరిపారు , ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీ గదాల శ్రీనివాస్ రావు గారు విచ్చేసారు

యుకె నలుమూల ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలు కాదు ప్రవాస ఆంధ్ర, ప్రవాస నార్త్ ఇండియన్స్ , వేరే దేశస్థులు సైతం ఈ పులా పండుగను జరుపుకోవడనికి , బతుకమ్మను కొలవడానికి ఒకే వేదిక మీదకు వచ్చారు , సుమారు 250 బతుకమ్మలు 4000 జనాలు కుటుంబ సమేతంగా వచ్చారు , తొలుత దుర్గాదేవి అమ్మవారి పూజతో మొదలైన వేడుక , తెలంగాణ జాగృతి యొక్క ఖ్యాతి , సేవ కార్యక్రమలను వివరించాక , పిల్లల సాంస్కృతిక నృత్యాలు , ఆ తరువాత మెగా బతుకమ్మ ఒకే సారి 2000 మంది ఆడబిడ్డలు బతుకమ్మ ని కొలుస్తూ ఉత్సాహంగా బతుకమ్మ పాటలను పాడుతూ , దానికి తగ్గ విదంగా ఆట పాటలతో సుమారు మూడు గంటలు అవిరామంగా సంతోషంగా బతుకమ్మ ఆడుకున్నారు, తరువాత DJ సాంగ్స్ కి అనుగుణంగా దాండియా ఆడారు , యువత, మహిళలతో తో పాటు అతిధి గదాల శ్రీనివాస్ రావు గారు కూడా బతుకమ్మ కోలాహలం లో పాలుపంచుకున్నారు

జాగృతి యుకె అధ్యక్షులు శ్రీ సుమన్ రావు బల్మురి ఎప్పుడు బతుకమ్మ పండుగ కి వచ్చిన ఆడబిడ్డలు సారె పొయ్యడం అనే సంప్రదాయాని పాటిస్తూ ఈ సంవత్సరం కూడా వచ్చిన ప్రతి ఆడబిడ్డకు చేనేత నేతలు నేసిన చీర దానితో బియ్యం , పసుపు కుంకుముల సారె కానుకుగా ఇచ్చారు , ఈ సందర్బంగా ముఖ్య అతిధి శ్రీ గదల శ్రీనివాస్ రావు గారు అతి పెద్ద బతుకమ్మ చేసి వచ్చిన వారికీ మొదటి రెండు మూడు బహుమతులుగా బంగారు వెండి కాయిన్స్ ఇవ్వడం జరిగింది

కార్యక్రమం లో వచ్చిన అతిధులందరికి తెలంగాణ ప్రత్యేక వంటకాలైన బిర్యానీ తో పాటు ఎన్నో పసందైన వంటకాలు ఉచితంగా అందించారు , ఫుడ్ స్పాన్సర్ హైదరాబాద్ దర్బార్ (Hyderabad Darbar) , బతుకమ్మ ఆట పాటల అనంతరం బతుకమ్మలను సాగనంపి ఆడవారందరు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని ప్రసాదాలను పంచారు , ఇలాంటి గొప్ప బతుకమ్మ కార్యక్రమం కేవలం జాగృతి యుకె శాఖ మాత్రమే చేయగలదని దానికి స్ఫూర్తి కవిత గారు , మరి జాగృతి యుకె బృందం సహాయ సహకారాలు , తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రవాస తెలంగాణ బిడ్డ కి జాగృతి యుకె అండగా ఉంటుందని , కేవలం పండుగులే కాకుండా ఎన్నో సేవ కార్యక్రమాలను పరిధి లో చేయడమే కాదు లోకల్ రోటరీ క్లబ్ ని కలుపుకొని ఎన్నో స్వచ్చంద సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నామని అధ్యక్షులు సుమన్ రావు బల్మురి తెలిపారు

వంశీ మునిగంటి , సుమన్ రావు బల్మురి వ్యాఖ్యానం , మరియు DJ సాయి బతుకమ్మ సాంగ్స్ , చిన్నారుల నృత్యాలు మరో కొసమెరుపు.

Wishing our M.D & C.E.O sri Nitish Chandra Vadrevu Sir a Very Happy Birthday. May god bless you  with Health, Happiness ...
17/01/2022

Wishing our M.D & C.E.O sri Nitish Chandra Vadrevu Sir a Very Happy Birthday. May god bless you with Health, Happiness & Prosperity.

05/10/2021

*పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలి : రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి*

*పట్టణ స్థానిక సంస్థల ప్రగతిపై శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత*

పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ గారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. పట్ణణ స్థానిక సంస్థలపై శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ క్షేత్ర స్థాయిలో విజయవంతంగా చేపడుతున్న 3,618 మంది కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్ లు, మేయర్లుకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కోరారు.

రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు కోటి 44 లక్షల జనాభా ఉందన్న ఎమ్మెల్సీ కవిత, పట్టణ స్థానిక సంస్థలు ప్రగతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఈ ఏడాది రూ.2,622 కోట్లను ఇవ్వడం జరిగిందన్నారు.
అదే విధంగా అర్బన్ లోకల్ బాడీల్లో సీసీ చార్జీలను రెగ్యులర్ గా కట్టుకోవడం, సానిటేషన్ వర్కర్లకు జీతాలు రెగ్యులర్ గా ఇవ్వడం, దాదాపు 2,300 కొత్త సానిటేషన్ వాహనాలను కొనుగోలు చేయడం, 38 లక్షల చెత్త బుట్టలను ఇంటింటికీ పంచడం, డంప్ యార్డులను ఏర్పాటు చేసుకోవడం, సీవరేజ్, మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పబ్లిక్ టాయిలెట్స్ ను విరివిగా నిర్మించడం, వైకుంఠధామాలు, ఎల్ ఈడీ వీధి దీపాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ల ఏర్పాటు, జంతువుల సంరక్షణ కేంద్రాలు, ఓపెన్ జిమ్ లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. వీటితో పాటు వీధి వ్యాపారులకు సైతం మంచి సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక కార్యక్రమాలు, పట్టణ హరిత హారంలో భాగంగా, నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, మల్టి లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని మండలిలో ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు. మున్సిపల్ బడ్జెట్ లో 10% గ్రీన్ బడ్జెట్ గా కేటాయించి, పట్టణాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

*రేపు ప్రతిష్టాత్మక తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట " అల్లిపూల వెన్నల " విడుదల* తెలంగాణ జాగృతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మి...
04/10/2021

*రేపు ప్రతిష్టాత్మక తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట " అల్లిపూల వెన్నల " విడుదల*

తెలంగాణ జాగృతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బతుకమ్మ పాట రేపు సాయంత్రం 5.30 గంటలకు విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు విలక్షణ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాశారు. ఉత్తరా ఉన్నికృష్ణన పాడారు..

రేపు సాయంత్రం 5:30 కు పాట HD వీడియో మరియు విడుదలకు సంబందించిన విజువల్స్ ఇవ్వడం జరుగుతుంది.

ఎటువంటి కాపీ రైట్ లేదు. దయ చేసి అందరూ ఉపయోగించుకోగలరు.

A.R. Rahman Goutham menon Kalvakuntla Kavitha Telangana Jagruthi Information Technology Wing Telangana Jagruthi

29/09/2021

ఈ రోజు 11.00 AM కి మహారాష్ట్ర ప్రభుత్వం జాయక్వాడీ ప్రాజెక్టు నుండి 9432 cusec. నీటిని విడుదల చేయనున్న సందర్భంగా మరాఠ్వాడా లో ని ఔరంగాబాద్ నుంచి ధర్మాబాద్ వద్ద ఉన్న బాబ్లీ మరియు కందకుర్తీ త్రీవెనీ సంగమం వరకూ నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆప్రమత్తం చేసింది, కావున మన తెలంగాణ ప్రాంతం లో ని నది పరీవాహక ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి
ఇప్పటికే కందకుర్తీ బ్రీడ్జీ పై నుంచి నది నీరు ఉప్పోంగుంతుందీ.
Be Alert.
🙏🙏

Nizamabad District Greater Adilabad

28/09/2021

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.

అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.

అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.

నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

Address

Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when Aanvi Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aanvi Media:

Share