Vishwakarma sangam vanastalipuram

Vishwakarma sangam vanastalipuram viswa karma sangam
vanastalipuram

ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ విశ్వకర్మ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన *శ్రీ విరాట్ వి...
17/09/2025

ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ విశ్వకర్మ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన *శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ* కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారు మరియు హయత్ నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, విశ్వకర్మ సహకార సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నరసింహ చారి, ఉపాధ్యక్షులు సాంబమూర్తి, సహాయ కార్యదర్శి బ్రహ్మచారి, కోశాధికారి సాయికుమార్, సలహాదారు గిరి బాబు మరియు తదితరులు ఉన్నారు

Vanastalipuram swarnakara sangam vanastalipuram general body meeting@mangalpalpally mahammai ammavari temple.
23/04/2023

Vanastalipuram swarnakara sangam vanastalipuram general body meeting@mangalpalpally mahammai ammavari temple.

16/09/2021
10/09/2021
ఈ రోజు తెలంగాణ స్వర్ణకార సంఘం ద్వితీయ మహాసభ ఎన్నికల సందర్భంగా ఏపీ ఆర్ గార్డెన్స్ లో ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్...
05/09/2021

ఈ రోజు తెలంగాణ స్వర్ణకార సంఘం ద్వితీయ మహాసభ ఎన్నికల సందర్భంగా ఏపీ ఆర్ గార్డెన్స్ లో ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లా ఎన్నికల కేంద్రంలో లో ఓటు హక్కు వినియోగించుకున్న వనస్థలిపురం స్వర్ణకార సంఘ సభ్యులు

కన్నె కంటి వెంకటేశ్వర్లు - అధ్యక్షులు
కన్నె కంటి సాంబమూర్తి - ఉపాధ్యక్షులు
చిల్లుమోజు సంతోష్ కుమార్ - ప్రధాన కార్యదర్శి
ముప్పవరం నరసింహ చారి - సహాయ కార్యదర్శి
మిట్టపల్లి సాయికుమార్ - కోశాధికారి

సభ్యులు

కొండపర్తి గిరిబాబు
తూడిమిల కుశ కుమార్
చెన్నోజు సుభాష్
మేడోజు నవీన్
మహేశ్వరం కృష్ణమాచారి

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్త...
16/08/2021

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు..
అక్కడ వసతి మరో ఎత్తు..
కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు,
ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం..
రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,
ఆర్థికంగా బలవంతులకు,
సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం…
అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి,
తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…?
వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..?
ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు….
కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…
రిజర్వ్ చేసుకొండి…
ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి…
ఇవిగో నంబర్లు, పేర్లు….

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,
వాటి ఫోన్ నంబర్లు:

Mool Mutt Ph:0877-2277499.

Pushpa Mantapam Ph:0877-2277301.

Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.

Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.

Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.

Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.

Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.

Sri Pushpagiri Mutt Ph-0877-2277419.

Sri Uuttaradi Mutt Ph-0877-2277397.

Udupi Mutt Ph-0877-2277305.

Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.

Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.

Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.

Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.

Sri Ahobita Mutt Ph:0877-2279440.

Sri Tirumala Kashi Mutt phone : 222 77316

Udipi Mutt Ph:0877 222 77305

Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)

Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)

Sri Vallabhacharya Mutt phone : 222 77317

Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302

Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436

Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826

Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

Sri Ahobila Mutt Ph:0877-2279440

Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269

Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445

Hotel Nilarama Choultry Ph:0877 222 77784

Sri Srinivasa Choultry Ph:0877 222 77883

Sri Hathiramji Mutt Ph:0877 222 77240

Karnataka Guest House Ph:0877 222 77238

Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435

Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం పదిమందికి Share చెయ్యండి…

ఇట్లు.
మీ..
వెలగా నారాయణరావు.
నర్సీపట్నం.

తన జీవితకాలమంతా తెలంగాణ కోసమే పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి నేడు. సారు భౌతికంగా మన మధ్యలేకున్నా... ఆయన చూపిన బాట...
06/08/2021

తన జీవితకాలమంతా తెలంగాణ కోసమే పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి నేడు. సారు భౌతికంగా మన మధ్యలేకున్నా... ఆయన చూపిన బాట ఉన్నది. సంఘటితంగా పోరాడితేనే స్వరాష్ట్రం సిద్ధిస్తుంది అన్న సారు మాటలను ఆచరణలో చూపెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాగే పునర్నిర్మాణంలోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలె. ఇదే సారుకు మనం ఇచ్చే నివాళి.

ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు...
22/06/2021

ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం

“ ఓం పూర్ణమద: పూర్ణమిదం

పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”
అనే శ్లోకం .

పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో
నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం.
అని వివరణ చేశారు గురువుగారు.🙏

“పేరు దేవుడిది-పొట్ట మనది”అని హేళనచేసేవారికి ఇప్పుడు సమాధానం చెప్పండి 🙏

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

Address

Hyderabad
500070

Telephone

+919885790077

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwakarma sangam vanastalipuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share