SriramNaik Ramavath

Directions Contact the business

SriramNaik Ramavath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SriramNaik Ramavath, Social Media Agency, Hyderabad.

ప్రెస్ నోట్ 05/10/2026 #ఠానూనాయక్_నంగారా_ఉత్సవాలను_జయప్రదం_చేయండి**- ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్...
05/10/2026

ప్రెస్ నోట్
05/10/2026
#ఠానూనాయక్_నంగారా_ఉత్సవాలను_జయప్రదం_చేయండి*

*- ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్ పిలుపు*

*- గిరిజన సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.*

సోమవారం,బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్ ఆర్ శ్రీరాం నాయక్, భూక్యా వీరభద్రం, ఎం బాలు నాయక్,వాంక్డోత్ వీరన్న,అశోక్ లతో కలిసి డా.రామచంద్రు నాయక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను హైదరాబాద్ లోని పలక్ నామా ప్రాంతంలోని రవీందర్ నాయక్ నగర్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 10 వ తేదీన ఉదయం.11.30 గంటలకు రవీందర్ నాయక్ నగర్ లోని లింబ్రా హోటల్ నుండి కళా ప్రదర్శ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళాకారులు ఆటపాటలతో ఉత్సవాలు రోజంతా జరుగుతాయని అన్నారు.గిరిజనుల సంస్కృతిని చాటి చెప్పే విధంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలంగాణ వ్యాపితంగా గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విరోచితంగా పోరాడి అమరుడైన గిరిజన యోధుడు ఠానూ నాయక్ పేరుమీద జరగడం చాలా సంతోషకరమని అన్నారు. మారుతున్న గిరిజనుల జీవన విధానం వలనా గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #అక్టోబర్ 10 న  జరుగుతున్న  #ఠానూనాయక్_నంగారా_ఉత్సవాలను జయప్రదం చేయండి. #గిరిజనసంఘాల_నాయకులు_పిలుపు*-ఠానూ నాయక్ విగ్రహా...
28/09/2026

#అక్టోబర్ 10 న జరుగుతున్న #ఠానూనాయక్_నంగారా_ఉత్సవాలను జయప్రదం చేయండి.
#గిరిజనసంఘాల_నాయకులు_పిలుపు

*-ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్.*

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్, సహారా రోడ్, ఎల్బీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంగా గిరిజనులు కళాకారులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల ఉద్దేశాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ ప్రతిపాదించిన తీర్మానంపై గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి రోజురోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇలాంటి గిరిజన ఉత్సవాలు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు దోహదపడతాయని అన్నారు. బంజారా గిరిజనులు మాట్లాడే గోర్ బోలి భాషకు లిపిని గుర్తించి రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజులపాటు చర్చించి పలు తీర్మానాలు చేసి భవిష్యత్తు ఐక్య ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఠానూ నాయక్ లాంటి గొప్ప పోరాట యోధుడి పేరుపై నంగారా ఉత్సవాలు జరపడం వారి పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయన్నారు. మహనీయులు, పోరాట వీరుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడి వీర మరణం పొందిన ఠానూ నాయక్ విగ్రహాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించాయి. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు 12 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, కళ్యాణ్ నాయక్, తిరుపతి నాయక్,
సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్,గణేష్ నాయక్.
లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు వడ్త్యా దాస్ రాం నాయక్, గోవింద్ నాయక్.
ఏఐబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్, కార్యదర్శి బస్కి నాయక్.
గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్రా శరత్ నాయక్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు,పద్మ.
ప్రొఫెసర్ శంకర్ నాయక్, ప్రొఫెసర్ ఆర్ చంద్రు నాయక్,
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎం బాల్య నాయక్, వి రామ్ కుమార్, ఆంగోత్ కృష్ణ నాయక్, ఎస్ కిషన్ నాయక్, ఆర్ పాండు నాయక్, ఎం గోపి నాయక్, హరి, గోర్ బంజారా ఎంప్లాయిస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి శోబన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #ఆహ్వానం*************తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు 2026 అక్టోబర్ 10,11 తేదీల్లో, ఎం ఇ రెడ్డి ఫంక్షన్ హాల్, సహ...
24/09/2026

#ఆహ్వానం*
************
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు 2026 అక్టోబర్ 10,11 తేదీల్లో, ఎం ఇ రెడ్డి ఫంక్షన్ హాల్, సహారా రోడ్, ఎల్బీనగర్, హైదరాబాద్ లో జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుపై నంగారా ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము.
ఈ ఉత్సవాల్లో గిరిజన సంఘాలు, మేధావులును ఆహ్వానించాలనుకున్నాము.

ఈ నంగారా ఉత్సవాల జయప్రధానికి మీ సూచనలు సలహాలు కొరకు 27-09-2026 న ఉ.10.30 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్ట్ గ్యాలరీలో *గిరిజన సమ్మేళనం* నిర్వహిస్తున్నాము.

కావున మీరు తప్పక హాజరు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నాము.

అభివందనములతో..
ఎం ధర్మ నాయక్
ఆర్ శ్రీరాం నాయక్
అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు
తెలంగాణ గిరిజన సంఘం.

 #తెలంగాణగిరిజనసంఘం  #మహబూబాబాద్_జిల్లా 4 వ  #మహాసభలుఘనంగాజరిగాయి. #ముఖ్యఅతిథిగా_మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
22/09/2026

#తెలంగాణగిరిజనసంఘం
#మహబూబాబాద్_జిల్లా 4 వ #మహాసభలుఘనంగాజరిగాయి.
#ముఖ్యఅతిథిగా_మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #రమావత్_శ్రీరాంనాయక్
#నూతనజిల్లాకమిటీఎన్నిక*
#జిల్లాఅధ్యక్షులుగా #బానోత్_వెంకన్న,
#జిల్లాకార్యదర్శిగా #మాలోత్_కిషన్,
#ఉపాధ్యక్షులుగా #బానోత్_సీతారాం తో పాటు మరో 20 మందితో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.

మంగళవారం(22/09/2026), మహబూబాబాద్ పట్టణంలోని పెరుమాళ్ళ జగన్నాథం భవన్లో బానోత్ వెంకన్న,జ్యోతి,అశ్విని, అచ్చాలి అధ్యక్షతన గిరిజన సంఘం జిల్లా 4 వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాదులో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుపై నంగారా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. అంతరించిపోతున్న గిరిజనుల సంస్కృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది గిరిజన కళాకారులు, ఉద్యమ నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ పులిన్ బస్కీ, ఉత్సవాల ఆహ్వాన సంఘం గౌరవ చైర్మన్ డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా. రామచంద్రనాయక్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, గిరిజన ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. రెండు రోజులపాటు హైదరాబాదులో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటు న్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామన్నారు. కేంద్రంలో బిజెపి గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గిరిజన సంస్కృతి ఆచారాలపై ఆధిపత్య మనువాద భావజాలంతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా బిజెపి ఆర్ఎస్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని, మైదాన ప్రాంతంలో 5 ఐటిడిఏలను ఏర్పాటు, ప్రతి గిరిజన తండా,గూడెం గ్రామపంచాయతీలకు ప్రతి ఏటా 25 లక్షలు, పోడు భూములకు హక్కు పత్రాలు, మూడు గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ప్రతి ఏటా 1500 కోట్లు ఇస్తామంటూ అనేక హామీలను ఇచ్చిందన్నారు. వాటిని ఇంతవరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీల అమలు కోసం భవిష్యత్తులో కలిసి వచ్చే గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు సాధుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న తదితరులు హాజరయ్యారు.

తేదీ:20/09/2026 ప్రెస్ నోట్ *ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి* -జూలకంటి రంగారెడ్డి పిలుపు.ఇబ్రహీంపట్నం:-తెలంగా...
20/09/2026

తేదీ:20/09/2026
ప్రెస్ నోట్

*ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి*

-జూలకంటి రంగారెడ్డి పిలుపు.

ఇబ్రహీంపట్నం:-తెలంగాణ గిరిజన సంఘం 4 వ రాష్ట్ర మహాసభలతో పాటు ఈ నెల 27,28 తేదీలలో జరుగుతున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల బ్రోచర్ ను మాజీ శాసనసభ్యులు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జులకంటి రంగారెడ్డితో పాటు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బోడా సామెల్ లు విడుదల చేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ అంతరిస్తున్న గిరిజనుల సంస్కృతిని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, ఎల్ బి నగర్ ప్రాంతంలోని ఎం ఇ రెడ్డి గార్డెన్ కామ్రేడ్ గుగులోత్ ధర్మనాయక్ నగర్ లో పెద్దఎత్తున జరుగుతాయని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది గిరిజన ఉద్యమ నాయకులు,కళాకారులు, మేధావులు, ప్రజా ప్రతినిధులుగా పాల్గొంటున్నారన్నారు. మొదటి రోజు జరిగే ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల్లో వేలాది మంది గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలు నాయక్,రంగారెడ్డి జిల్లా నాయకలు ఎం.గోపినాయక్ ,ఆర్ పాండు నాయక్, కె హరీష్ నాయక్, అవుజా నా, కె శంకర్ నాయక్, గౌతంనాయక్,కె జానకిరాం తదితరులు పాల్గొన్నారు.

అభివందనములతో...
ఎం గోపీ నాయక్
జిల్లా నాయకులు
రంగారెడ్డి జిల్లా

08/09/2026
07/09/2026

#కేంద్ర_బిజెపి_అనుసరిస్తున్నఆదివాసిగిరిజన_వ్యతిరేకవిధానాలపై 7/9/2026 వ తేదీన ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ లో #మహాధర్నా...

న్యూ ఢిల్లీ. పాల్గొన్న వివిధ రాష్ట్రాల నుండి వేలాదిమంది ఆదివాసీ గిరిజనలు, నాయకులు. ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్,త్రిపుర మాజీ మంత్రి జితిన్ చౌదరీ,కన్వీనర్ మాజీ రాజ్యసభ సభ్యులు పశ్చిమబెంగాల్ పులిన్ బస్కి,, మాజీ రాజ్యసభ సభ్యురాలు ఆదివాసి జాతీయ నాయకురాలు బృందా కారత్, భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యు లు డాక్టర్ మిడియం బాబురావు గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, తెలంగాణ గిరిజన సంఘం నుంచి పాల్గొన్న నాయకులు కార్యకర్తలు. బండారు రవి కుమార్,ఎం ధర్మ నాయక్, భూక్యవీరభద్రం, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు.

06/09/2026

#తీజ్_ఉత్సవాలు.. ఫలక్ నామా(హైదరాబాద్) రవీందర్ నాయక్ నగర్ బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బంజారా గిరిజనుల తీజ్ ఉత్సవాలు ఆంగోత్ కృష్ణ నాయక్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు,కార్యదర్శి వి రాంకుమార్ నాయక్, ఎం బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.. తీజ్ నిమజ్జనం కార్యక్రమంలో వందలాదిమంది ఆడపిల్లలు మహిళలు యువకులు పాల్గొన్నారు..

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SriramNaik Ramavath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SriramNaik Ramavath:

Shortcuts

Share