28/04/2020
ఫోటోటెక్ ఫోటోగ్రఫీ రంగం ఎనాలసిస్...
Fototech news: ఫొటొగ్రఫి రంగం పై ఎంత మంది ఆధరాపడి ఉన్నారు...మన రంగం మర్కెట్ విలువ ఎంత? మన ద్వారా ప్రభుత్వాలకు ఎంత ఆదాయం సమకూరుతుంది? ఇల ప్రతి అంశం పై ఫొటొటెక్ ఎనాలసిస్ చేసింది ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..
తెలుగు రాష్ట్రాల్లో ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి జీవించే ఫోటోగ్రాఫర్లు మరియు అనుబంధ వృత్తుల వారి వివరాలు
తెలంగాణ వివరాలు
ఫోటోగ్రాఫర్లు: 30,000
వీడియో గ్రాఫర్స్:25,000
ఆల్బమ్ డిజైనర్లు: 6,000
వీడియో ఎడిటర్స్ :5,000
ఫోటోస్టోర్స్: 300
ఫోటో కలర్ ల్యాబ్స్: 1000
అనుబంధ రంగం(ఫ్రెమ్స్,ఎల్.ఈ.డి వాల్స్, కెమెరాసర్వీస్, డీలర్స్ మరియు ఇతరులు): 5000
మొత్తం: 72,200
ఆంధ్రప్రదేశ్ వివరాలు
ఫోటోగ్రాఫర్లు: 35,000
వీడియో గ్రాఫర్స్:30,000
ఆల్బమ్ డిజైనర్లు:7,000
వీడియో ఎడిటర్స్:6,000
ఫోటోస్టోర్స్:300
ఫోటో కలర్ ల్యాబ్స్:350
అనుబంధ రంగం(ఫ్రెమ్స్,ఎల్.ఈ.డి వాల్స్, కెమెరాసర్వీస్, డీలర్స్ మరియు ఇతరులు):5,000
మొత్తం: 83,650
ఫోటోగ్రఫీ ట్రేడ్ బిజినెస్
సంవత్సరం మొత్తం ఫోటోగ్రఫీ ట్రేడ్ బిజినెస్( విలువ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 700 నుండి 800 కోట్లు
ఈవెంట్ ఫోటోగ్రఫీ బిజినెస్
ప్రతి ఏట సుమారు 10 లక్షల వరకు పెళ్ళిల్లు జరుగుతాయి అని అంచనా..ఇందులో 5 లక్షల రూపయల ఫొటొగ్రఫి బిల్లులు సుమారు 20 శాతం వరకు ఉంటాయి..ఇంకొ 20 శాతం పెళ్ళిల్లు 1 నుండి 2 లక్ష్ల రూపయల బిల్లులవి. ఇంకొ 20 శాతం పెళ్ళిల్లు సుమారు 1 లక్ష రూపాయలు.ఇంకొ 20 శాతం పెళ్ళిల్లు సుమారు 50 వేల రూపాయలు కాగా మిగా 20 శాతం 20 నుండి 50 వేల వరకు ఫొటొగ్రఫి బడ్జెట్ ఉంటుంది..మొత్తం సుమారుగా 50 వేల రూపాయలు తీసుకున్నా 5000 కోట్లు...ఇంక ఇతర కార్యక్రమాలు..స్టుడియోలు ఇలా అన్ని కలుపుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వెడ్డింగ్ మరియు ఈవెంట్ ఫోటోగ్రఫీ సర్వీసు విలువ మొత్తం సుమారు 7 నుండి 8 వేల కోట్లు
ప్రభుత్వాలకు మన ఫొటొగ్రఫి రంగం నుండి ఆదాయం
మనం కెనాన్/ సోని/నికాన్ ఇలా ఏదేని ఒక కంపెని కెమర 2 లక్షలు పెట్టి కొంటే దాదాపు 30 వేల రూపాయలు టాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది..మనకు ఇండిగో ల్యాబ్ వారు లేదా లైట్ వెయిట్ అల్బం ప్రింట్ వేయించుకున్నప్పుడు పోటి ధరల్లో వారు మనకు టాక్స్ వెయ్యకున్న మన తరుపున సుమారు 5 రూపాయలకు పైగా టక్స్ కడుతారు అంటే మనం ఒక్క ప్రింట్ వేయిస్తే ప్రభుత్వానికి 5 రూపాయల ఆధాయం
ఫోటోగ్రపీ సర్వీసు బిజినెస్లో 90 శాతం అనధికారికంగా జరిగినా ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఫోటోగ్రఫీ రంగం తరుపున పన్నుల రూపంలో కానీ ఇన్ కమ్ టాక్స్ రూపంలో కానీ సుమారు 200 కోట్ల ఆదయం సమకూరుతుంది అని అంచానా..
ఇంత పెద్ద ఇండస్ట్రి ప్రతి సంవత్సరం 10 నుండి 20 శాతం పెరుగుదలతో ముందుకు వెళ్తుంది..ఈ సంవత్సరం 2020 లో మొత్తం ట్రేడ్ బిజినెస్స్ కాని సర్వీస్ బిజినెస్స్ కాని 20 శాతం అందుకుంటే అదే గొప్ప..ఇప్పుడు ప్రభుత్వాలు ఈ ఇండస్ట్రిని కాపాడాలి అంటే ఫొటొగ్రఫి రంగానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు అనేది ఆవశ్యకం..