02/09/2024
*నాచేపల్లి నేలకొండపల్లి మండలం ప్రదాన రహదారి పూర్తి ధ్వంసం*
-గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మూడు మండలాల వారధి దాదాపు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల ప్రదాన రహదారి పూర్తి ధ్వంసం అయింది.
-నాచేపల్లి గ్రామం నుంచి నేలకొండపల్లి వెళ్ళే ప్రదాన రహదారి మైసమ్మ,గంగమ్మ దేవాలయం, నేలకొండపల్లి నుంచి నాచేపల్లి వచ్చే రహదారి దిగువ భాగంలో పూర్తిగా ధ్వంసం అయి దాదాపు రెండు మీటర్ల లోతులో గుంట పడటం, మరియు రెండు వందల మీటర్ల వరకురోడ్డు కోతకు గురికావడంతో నాచేపల్లి రైతుల ఇబ్బంది వర్ణనాతీతం.
-ఈ రహదారి నేలకొండపల్లి వెళ్ళటానికి ప్రదాన రహదారి నిత్యం ప్రజానీకం వివిధ అవసరాల నిమిత్తం వెళ్లటం జరుగుతుంది. నేలకొండపల్లి, కోదాడ, ఖమ్మం కు ఇదే ప్రధాన రహదారి అవటంతో ప్రజానీకం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
*ఊహించని విధంగా వరద రావటం ముఖ్యంగా వరి పంట సాగు విస్తీర్ణం ఎక్కువ గా ఉండటం దాదాపు నెల రోజుల నుంచి చంటి పిల్లల మాదిరిగా పెంచుకున్న వ్యవసాయ పంట నీటిపాలు కావటం పోలాలకు,ఒండుమేట పెట్టటం చూస్తుంటే అతి తీవ్రంగా నాచేపల్లి రైతు నష్టపోయాడు అని చెప్పవచ్చు.*
*ప్రభుత్వం ఖచ్చితంగా అందుకోవాలని, రోడ్డు పనులు,పంట నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని పలువురు కోరుతున్నారు*