23/05/2026
ఈ నెల 25, 26 తేదీలలో రాజమహేంద్రవరంలో ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ డి.నరసింహ కిషోర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ వై.మేఘా స్వరూప్ గారు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ రాహుల్ మీనా గార్లతో కలిసి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించాను.
గోదావరి పరీవాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, ఘాట్ల అభివృద్ధి, నల్లా ఛానల్ శుద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రాబోయే పుష్కరాలను ఆరోగ్యవంతంగా, ఆధ్యాత్మికత వెల్లివిరిసే విధంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని తెలియజేస్తున్నాను.