123Rayachoti

Call

123Rayachoti ఫాలో చేయ్ మావా 💁🙏

 భర్త చనిపోయిన తర్వాత భర్త చేస్తున్న ఉద్యోగం ఆ భార్యకు వచ్చింది. ఆ తర్వాత ఆ భార్య వివాహం చేసుకుంది .దీంతో అత్తమామలను చూడ...
27/09/2026


భర్త చనిపోయిన తర్వాత భర్త చేస్తున్న ఉద్యోగం ఆ భార్యకు వచ్చింది. ఆ తర్వాత ఆ భార్య వివాహం చేసుకుంది .దీంతో అత్తమామలను చూడడం మానేసింది. వారికి ఉన్న ఏకైక ఆధారం కొడుకు బ్రతికుండగా ఇచ్చే డబ్బులే.. అయితే కోడలు ఉద్యోగం వచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమె కాపురం విడిగా పెట్టేసి, అత్తకు డబ్బులు ఇవ్వడం మానేసింది దీంతో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. హైకోర్టు దీనిపై విచారణ జరిపి అజ్మీర్ విద్యుత్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది . భర్త చనిపోతే భార్య తీసుకున్న ఉద్యోగానికి వచ్చే జీతం లో 25 శాతం చనిపోయిన భర్త తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆ మేరకు వారి బ్యాంకు అకౌంట్లో నేరుగా విద్యుత్ బోర్డు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తమ కొడుకు చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం కోడలికి ఇప్పిస్తే తమను చూసుకుంటుందన్న ఉద్దేశంతో తాము కూడా ప్రతిపాదన చేసి సంతకాలు పెట్టామని అత్త కోర్టుకు విజ్ఞప్తి చేసింది . అయితే కోడలు మాత్రం తనను అత్తమామలు సరిగా చూసుకోలేదని అందువల్ల వాళ్లకి జీతం ఇవ్వనని అందులోను తాను రెండో పెళ్లి చేసుకున్నారంటూ పిటిషన్ వేసింది . అయితే కోర్టు ఆమె పిటీషన్ను అంగీకరించలేదు . తల్లిదండ్రులకు 25 శాతం జీతం వెళ్లాల్సిందే అంటూ తీర్పు చెప్పింది ఈ మేరకు విద్యుత్ బోర్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

27/09/2026

లక్ష్మిపురం లో 💁 కొత్త సిమెంట్ రోడ్డు.

రాయచోటి 💁 లక్ష్మి పురం లో కొత్త సిమెంట్ రోడ్డు
27/09/2026

రాయచోటి 💁 లక్ష్మి పురం లో కొత్త సిమెంట్ రోడ్డు

  కాకతీయ సామ్రాజ్య రక్షకుడు "రేచర్ల రుద్రారెడ్డి" రేచర్ల రుద్రారెడ్డి ( 13వ శతాబ్దం )రేచర్లరెడ్లు, చెరకురెడ్లు, మల్యాలరె...
27/09/2026


కాకతీయ సామ్రాజ్య రక్షకుడు "రేచర్ల రుద్రారెడ్డి"
రేచర్ల రుద్రారెడ్డి ( 13వ శతాబ్దం )

రేచర్లరెడ్లు, చెరకురెడ్లు, మల్యాలరెడ్లు,విరియాల రెడ్లు , గోన రెడ్లు, వావిలాల రెడ్లు కాకతీయ సామంతులుగా మహాసామంతులుగా రాజ్యాల్ని పాలించారు. జైత్రయాత్రలు నిర్వహించారు. సాహిత్యాన్ని, కళల్ని, పోషించారు. ఆలయాల్ని నిర్మించారు. భూదానాలు గావించారు. జనరంజక పాలనతో చరిత్రని సృష్టించారు. కాగా...
🔥కాకతీయ సామ్రాజ్యం సంక్షోభంలో ఉన్న సమయంలో శత్రు రాజ్యాలను ఎదుర్కొని కాకతీయ రాజ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాడు రేచర్ల రుద్రారెడ్డి.

🚩రేచర్ల రెడ్డివంశం (సా.శ 992 -సా. శ.1289)

కాకతీయరాజులు సామంత రాజుల నుండి స్వతంత్ర రాజులుగా ఏర్పడే వరకు రేచర్ల రెడ్లు వీరికి సహాయకులుగా ఉన్నారు. కాకతీయ రాజుల్లో మొదటి బేతరాజుగా పిలవబడే గరుడ బేతయ (సా.శ 996- సా.శ 1051) నుండి రెండవ ప్రతాపరుద్రుడు (సా.శ 1289- సా. శ 1323) వరకు రేచర్లరెడ్ల పాలన క్రమం కనిపిస్తుంది. వీరు కాకతీయుల వద్ద సేనాపతులుగా,మంత్రులుగా సామంతులుగా, మహా సామంతులుగా పనిచేశారు.

లభ్యమైన ఆధారాల ప్రకారం ఇప్పటివరకు బమ్మసేనాని అని పిలవబడే రేచర్ల బొమ్మిరెడ్డిని రేచర్లరెడ్ల మూలపురుషుడుగా చరిత్ర చెబుతూ వచ్చింది.కానీ నవీన పరిశోధనల ప్రకారం
" నాగయ్య గావుండ " అనే వీరుడు రేచర్ల రెడ్ల మూలపురుషుడిగా తెలుస్తున్నది.

చరిత్ర పరిశోధకులు ఆవాల బుచ్చిరెడ్డి గారు తన అవిశ్రాంత పరిశోధనా ఫలితంగా జమ్మికుంట (కరీంనగర్ జిల్లా)కు చెందిన నాగయ్య గావుండ
రేచర్ల రెడ్ల మూలపురుషుడుగా నిర్దారిస్తున్నాడు. రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణరాజు (సా.శ. 878-సా.శ. 914) కుమారుడైన , జగత్తుంగని మూడవ భార్య కుమారుడు నాగయ్య గావుండ
అని పేర్కొంటున్నాడు.నాగయ్య గావుండ
మొదట్లో కాకతీయ నాలుగవ గండయ్యకు(సా.శ 955- సా.శ 995), ఆ తర్వాత మొదటి బేతరాజుకు (సా.శ 996- సా.శ 1051) సేనానిగా వ్యవహరించినట్లు గుర్తించాడు.

నాగయ్య గావుండకు ఇద్దరు సంతానం. కూతురు లోకాంబిక, బహ్మయ్య లేదా బమ్మసేనాని అను కుమారుడు ఉన్నారు . లోకాంబిక వేములవాడ చాళుక్యరాజయిన రెండవ అరికేసరి ( సా.శ 939-సా.శ 955) భార్య.
నాగయ్య గావుండ సా.శ. 995లో వేయించిన జమ్మికుంట శాసనం ద్వారా ఇతనికి
" ముచ్చలధీరుడు " " ముచ్చలశూరుడు " బిరుదములున్నట్లు తెలుస్తున్నది.

▪️రేచర్లబమ్మిరెడ్డి :
కాకతీయ మొదటి బేతరాజు (సా.శ 996- సా.శ 1051)కళ్యాణి చాళుక్యుల సామంత రాజుగా కొనసాగుతున్నప్పుడు, రేచర్ల బమ్మిరెడ్డి ఈ మొదటి బేతరాజు వద్దనే సేనానిగా సా.శ 1051లో ప్రస్థానం ప్రారంభించాడు . ఈ మొదటి బేతరాజు చాళుక్యుల తరఫున చోళులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు, రేచర్ల బొమ్మిరెడ్డి తన సేనలతో చోళ సైన్యాలపై దండెత్తి ఓడించాడు. కాంచినగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాంచీ రాకుమార్తే విజయలక్ష్మి తో బేతరాజుకు వివాహం జరిపించాడు.
బమ్మిరెడ్డి కాకతీయ మొదటి బేతరాజుతో పాటుగా మొదటి ప్రోలరాజు( సా.శ 1052- సా.శ 1076) వద్ద కూడా సేనానిగా తన ప్రతాపాన్ని నిరూపించుకున్నాడు

▪️ రేచర్ల ముచ్చారెడ్డి:
ఇతడిని ముచ్చసేనాని అని కూడా అంటారు. ఇతడు రేచర్ల బమ్మిరెడ్డి కుమారుడు.రెండవ బేతరాజుగా పిలవబడే త్రిభువన మల్లుడు (సా.శ 1076- సా.శ 1108) వద్ద ముచ్చారెడ్డి సేనానిగా చేరుతాడు. కొంకనం,కోర్పర్తి, చక్రకూటం మొదలగు ప్రాంతాలను జయిస్తాడు.

▪️రేచర్ల కాటారెడ్డి :
రేచర్ల ముచ్చారెడ్డి కొడుకు రేచర్ల కాటారెడ్డి. వీరిని కాటసేనాని అని కూడా అంటారు.. ఇతడు రెండవ బేతరాజు వద్దనే సామంత కాకతీయ రాజ్య వ్యవహారాలను చక్కదిద్దే ఉన్నత స్థానంలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు.బేతరాజు తరువాత పాలనకు వచ్చిన త్రిభువనమల్ల దుర్గరాజు(సా.శ 1108- సా.శ 1116) వద్ద కూడ ఇతడు పనిచేసాడు..

▪️రేచర్ల కామచమూపతిరెడ్డి :
రేచర్ల కాటారెడ్డి కుమారుడే రేచర్ల కామచమూపతి రెడ్డి. కామచమూపతి అని పిలుస్తారు. ఇతడు త్రిభువనమల్ల దుర్గరాజు తర్వాత పాలనకు వచ్చిన మహా సామంత కాకతీయ రెండవప్రోలరాజు (సా.శ 1116- సా.శ 1157)వద్ద
సామంతుడిగా వ్యవహరించాడు. గుండరాజును ఓడిస్తాడు.
రేచర్ల కామచమూపతి భార్య కాచాంబిక. ఈ దంపతులకు రెండవ కాటచమూపతి, బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ముగ్గురు కుమారులు, వల్లసాని అనే కూతురు ఉన్నారు.

▪️రెండవ కాటచమూపతి :
ఇతడు కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు వద్ద సర్వ సైన్యాధ్యక్షుడు. మొదటి ప్రతాపరుద్రుడు కళ్యాణి చాళుక్యుల వద్ద సా.శ 1157 -సా.శ 1162 వరకు సామంత రాజుగా ఉన్నాడు. కళ్యాణి చాళుక్యులు పదవి భష్టులైన తరువాత సా.శ 1163లో స్వతంత్రించి - సా.శ 1196 వరకు పాలన కొనసాగించాడు. రెండవ కాటచమూపతి మొదటి ప్రతాపరుద్రుడికి అనేక యుద్ధాల్లో సహాయం చేశాడు. ఈ క్రమంలోనే ఎలకుర్తి రాజ్యాన్ని సంపాదించి,
నర్సంపేట ములుగు హుజురాబాద్ మార్చాపూర్ ప్రాంతాలకు అధిపతిగా నియమించబడ్డాడు. మహా సామంతుడిగా కొనసాగాడు.

రెండవ కాటచమూపతి భార్య బెజ్జమాంబ. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు రెండవ ముచ్చారెడ్డి లేదా ముచ్చసేనాని. మరొకరు రుద్రసేనాని లేదా రుద్రారెడ్డి. ఇతడే రేచర్ల రుద్రారెడ్డిగా కాకతీయ చరిత్రలో సుప్రసిద్ధుడుగా ఘనతి సాధించాడు.

▪️ రేచర్ల నామిరెడ్డి - బేతిరెడ్డి :

రేచర్ల కామచమూపతిరెడ్డి మరో ఇద్దరు కుమారులైన
నామిరెడ్డి - బేతిరెడ్డిలను సోదరుడు రెండవ కాటచమూపతి మొదటి ప్రతాపరుద్రుడి వద్ద దండ నాయకులుగా నియమింపజేస్తాడు. నామిరెడ్డి, బేతిరెడ్డి , కందూరు చోడరాజ్యాన్ని జయించుటలో కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడికి సహాయపడతారు .

తనకు యుద్ధంలో సహాయపడిన బేతిరెడ్డిని మొదటి ప్రతాపరుద్రుడు ఆమనగల్లు రాజ్యానికి సామంతుడుగా నియమిస్తాడు.ఈ క్రమంలో బేతిరెడ్డి
పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించి పిల్లలమర్రి భేతిరెడ్డిగా ప్రసిద్ధుడు అయ్యాడు.

నామిరెడ్డిని నాగులపాడు ప్రాంత పరిపాలన వ్యవహారాలు చూడటానికి నియమిస్తాడు. నామిరెడ్డికి కాట్రెడ్డి, కామిరెడ్డి,అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇట్లా రెండవ కాటచమూపతి వంశం ఎలకుర్తి రాజ్యాన్ని, నామిరెడ్డి - బేతిరెడ్డిల వంశం ఆమనగల్లు రాజ్యాన్ని పాలిస్తారు.. ఈ విధంగా
రేచర్ల రెడ్డి రాజులు రెండు శాఖలుగా రాజ్యాల్ని పాలించారు .
రేచర్ల రెడ్డి రాజ్యాలు :

1) ఆమనగల్లు రాజ్యం : పిల్లలమర్రి, నాగులపాడు, తాడువాయి, వాడపల్లి , సోమవరం, బూరుగుగడ్డ, చిలుకూరు, సిరికొండ ప్రాంతాలు ఆమనగల్లు .

2) ఎలకుర్తి రాజ్యం : మాచాపూర్, డిచ్చకుంట, గొడిశాల, రామన్నపేట, ధర్మారావుపేట, పాలంపేట, చిట్యాలంపాడు.

రేచర్ల రెడ్లు తాము పాలించిన ప్రాంతాల్లో శాసనాలు వేయించారు. దుర్గాలు, దేవాలయాలు నిర్మించారు. విద్యాపీఠాలు నెలకొల్పారు. తెలుగు సంస్కృత భాషలను ఆదరించారురామప్ప చెరువు, నామ సముద్రం మొదలైన చెరువులు, కాలువలను తవ్వించారు. తాత్విక ఆధ్యాత్మిక ధర్మ మఠాలు నిర్వహించారు.ప్రజలకు సుభిక్షమైన సురక్షితమైన పాలన అందించారు

🔥రేచర్ల రుద్రారెడ్డి వీరత్వం

కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల రుద్రారెడ్డి పాత్ర ఎంతో కీలకమైనది. వీరి తండ్రి రెండవ కాటచమూపతి. మొదటి ప్రతాపరుద్రుడు వద్ద సర్వ సైన్యాధ్యక్షుడు. తండ్రి వారసత్వంలో రుద్రారెడ్డి కూడా రాజ్యం రక్షణవ్యవస్థలో సేనానిగా ఉన్నాడు.

దేవగిరి ఏలుతున్న యాదవరాజు జైత్రపాలుడుతో
కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడికి సా.శ 1195 ప్రాంతంలో విభేదాలు వచ్చాయి..జైత్రపాలుడు
అదునుచూసి కాకతీయ మొదటి ప్రతాపరుద్రదేవుడిపై దండయాత్ర నిర్వహించాడు.. ఈ యుద్ధంలో మొదటి ప్రతాపరుద్రుడు మరణించాడు. జైత్రపాలుడు మొదటి ప్రతాప రుద్రదేవుడి తమ్ముడు మహాదేవుడి కుమారుడు బాలుడైన గణపతిదేవుని బంధించి తీసుకువెళ్లాడు.తర్వాత మహాదేవుడు జైత్రపాలుడుకు ఎదురునిలిచి 1196లో ఓరుగల్లు సింహాసనం అదిష్టించాడు. 1198లో తన కుమారుడు గణపతిదేవుడిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణంతో కాకతీయ రాజ్యము సంక్షోభంలో పడుతుంది. ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోడులు, చోళ రాజులు, కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.. ఈ విపత్కర పరిస్థితుల్లో సేనాని రేచర్ల రుద్రారెడ్డి రంగ ప్రవేశం చేసాడు. మల్యాల, విరియాల, చెరుకు, సామంతుల అండదండలతో , శత్రురాజుల్ని సమూలంగా అణిచివేసాడు. ఈ క్రమంలో చివరి ముదిగొండ చాళుక్యరాజైన నాగతి రాజును రేచర్ల రుద్రారెడ్డి ఓడించినట్టు పాలంపేట రామప్ప గుడి శాసనం చెబుతున్నది. కాగా బందీగా ఉన్న గణపతిదేవుడిని విడిపించేందుకు యాదవులతో యుద్ధం కంటే దౌత్యమే సరైన మార్గమని భావించి చర్చలు జరిపించాడు.
​యాదవ రాజు జైత్రపాలుడు కూడా కాకతీయులను నాశనం చేస్తే దక్షిణం నుండి తమకు రక్షణ ఉండదని గ్రహించాడు. దీంతో జైత్రపాలుడు తన కుమార్తె సోమలదేవిని గణపతిదేవుడికి ఇచ్చి వివాహం జరిపించి, కయ్యానికి స్వస్తి చెప్పాడు.. ఈ విధంగా మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడుని చెరనుండి విడిపించాడు.
గణపతిదేవుడు తిరిగి ఓరుగల్లుకు రాగానే, రేచర్ల రుద్రుడు తనకు వచ్చిన రాజ్యాధికారాన్ని అనుభవించకుండా, ఎంతో నిస్వార్థంతో ఆయనకు పట్టాభిషేకం జరిపాడు. ఇట్లా రేచర్ల రుద్రారెడ్డి చాణక్యంతో
సా.శ 1199లో గణపతిదేవుడు ఓరుగల్లు సింహాసనం ఆదిష్టించాడు.సేనాధిపతిగా రేచెర్ల రుద్రారెడ్డి తన శక్తియుక్తులు ధారపోసి కాకతీయ రాజ్యాన్ని కాపాడాడు కాబట్టే ''సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య''
"కాకతి రాజ్య సమర్థ" "కాకతీయ రాజ్య భార దౌరేయ" బిరుదులు ఉన్నట్టు దాక్షారామ ఉప్పరపల్లి శాసనాల ద్వారా తెలుస్తున్నది....

🚩రేచర్ల రెడ్లు నిర్మించిన ఆలయాలు

కాకతీయ సామంత రాజులుగా పనిచేసిన రేచర్ల, చెరుకు, గోన, మాల్యాల, విరియాల, వావిలాల, రెడ్డి రాజులు తమ పరిపాలన కాలాల్లో ఎన్నో ప్రముఖ ఆలయాల్ని నిర్మించారు.రేచర్ల రెడ్లు నిర్మించిన గుడులు గమనిస్తే...

🙏ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువుకట్ట మీద కాకతీయుల శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర టీం గుర్తించింది. ఈ శాసనం కాకతీయ గణపతిదేవుని ముఖ్య సేనాని రేచర్ల రుద్రారెడ్డి మనవడైన పసాయిత గణపతిరెడ్డి వేయించినది గుర్తించారు. నేలకొండపల్లి చెరువుగట్టుమీద కొలువైన ప్రోలకమ్మ, నూకాలమ్మ, మారకమ్మలు అనే ముగ్గురు అమ్మదేవతలకు అలంకరణల నిమిత్తం ఆభరణాలు చేయించి, అమ్మవార్ల నిత్య కైంకర్యానికి నైవేద్యాలకు 2 మర్తురుల భూమిని దానం చేసినట్లు శాసనంలో రాయబడింది..

🙏నామేశ్వర దేవాలయం
ఈ ఆలయాన్ని పార్వతి మహాదేవ నామేశ్వర దేవాలయం అంటారు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో మూసీ నదిఒడ్డున ఈ దేవాలయాన్ని సా.శ 1202 లో రేచర్ల కుటుంబానికి చెందిన నామిరెడ్డి నిర్మించాడు.

🙏ఎఱకేశ్వర దేవాలయం
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి గ్రామానికి పశ్చిమ దిశలో మూసీ నది ఒడ్డున ఎఱకేశ్వరాలయం నిర్మించబడింది.సా.శ 1208లో కాకతీయుల సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన భేతిరెడ్డి భార్య ఎరాసనమ్మ (ఎఱకసానమ్మ ) జ్ఞాపకార్థం ఆలయం నిర్మించబడింది..

🙏త్రికూటేశ్వర దేవాలయం
తెలంగాణ , సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి గ్రామంలో రేచర్ల రెడ్లు నిర్మించిన త్రికూటేశ్వర దేవాలయం ఉన్నది.

🙏రామప్ప దేవాలయం
ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పాలంపేట దగ్గర రామప్ప దేవాలయం ఉన్నది .
సా.శ 1199-సా.శ 1260 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతిదేవుడి సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి ఈ ఆలయాన్ని సా.శ 1213 లో కట్టించాడు .మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో విష్ణు అవతారమైన రాముడు సేవించిన లింగస్వరూప రామలింగేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు.

జయాపసేనానీ నృత్యరత్నాకరం,వాద్యరత్నాకరం గ్రంధాలు ఆధారంగా ఈ ఆలయం నిర్మించారు.
నీటిపై తేలియాడే ఇటుకలను ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఈ ఆలయం ప్రత్యేకత.
త్రిభంగీ నాట్య భంగిమలు...మార్థంగి కురాండ్ర శిల్పాలు..మదనిక నల్లరాతి శిల్పాలు...
సప్తస్వరాలు పలికించే అద్భుత శిల్ప సౌందర్యం...
పౌరాణిక,ఇతిహాస ఘట్టాలతో కూడిన శిల్ప సమూహాలు...మరెన్నో అద్భుత శిల్పకళా సౌందర్యంతో ఆలయం వెలుగొందుతున్నది. ఈ శిల్పాలను చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప అని చెబుతుంటారు.వీరి పేరు మీదుగానే ఆలయం ప్రచారం చేయబడింది. 2021 జులై 25న ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం ప్రకటించబడింది.

🙏కోటగుళ్ళు
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల పరిధిలో కోటగుళ్ళు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. విభిన్న పరిమాణాల్లో ఉన్న 22 గుడుల సముదాయాన్ని కోటగుళ్లు అంటారు. సా.శ 1199-సా.శ 1260 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడి నాయకత్వంలో, రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి
సా.శ 1213లో ఈ కోట గుళ్ళను నిర్మించాడు. కాకతీయులు, రేచర్ల రెడ్లు శైవ మతాభిమానులు. అయినప్పటికీ కేశవ భేదాన్ని చూపించకుండా రేచర్ల గణపతి రెడ్డి ఈ ఆలయాలను నిర్మించడం జరిగింది. ఇక్కడ గణపేశ్వరుడుగా గణపేశ్వరాలయంలో శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఇది ప్రధాన ఆలయం.
ప్రపంచ పర్యాటక సంస్థ WTO హెరిటేజ్‌ కేంద్రాల గుర్తింపులో భాగంగా ముద్రించిన "'ప్రపంచ పర్యాటక కేంద్రాలు " గ్రంథంలో గణపేశ్వరాలయం వివరించబడింది
🙏సూర్యాపేట దగ్గరలో ఉన్న నాగులపాడు
గ్రామం రేచర్ల నామిరెడ్డి తొలి నివాసం. ఇక్కడ
నామేశ్వర, కాదేశ్వర, కాటేశ్వర, కామేశ్వర ఆలయములను రేచర్ల రెడ్లు నిర్మించారు.
🙏గొడిశాలలో పంచలింగేశ్వరాలయము
రేచర్ల రెడ్లు సారథ్యంలో నిర్మించారు.కాకతీయ గణపతిదేవుని ప్రధాని రేచర్ల రుద్రారెడ్డి మంత్రి రాజనాయకుని కుమారుడు కాటయ సేనాని సా. శ .1236 జనవరి 24న పంచలింగాలకు ఇచ్చిన భూదాన వివరాలున్నాయి.
🙏డిచ్చకుంట, రామన్నపేట, చిట్యాలంపాడు, ఎలకుర్తి, మాచాపూరు తదితర ప్రాంతాల్లో అనేక దేవాలయములు ఈ రేచర్ల రెడ్లు నిర్మించారు....
🔥రేచర్ల రెడ్లు గురించి ఆధారం
తెలంగాణ ప్రభుత్వ డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCR HRD Institute) ప్రచురించిన History of Telangana – Land & People (Stone Age to 1323 CE) గ్రంథంలో కాకతీయుల సామంతుల గురించి చెబుతూ:
“The Recherla Chiefs They were Reddis by caste”
అని స్పష్టంగా పేర్కొంది. అలాగే వీరు రేచెరువుల గ్రామం నుంచి ఉద్భవించినవారై ఉండవచ్చని పేర్కొంటుంది. అదే సందర్భంలో, ఇదే పేరుతో ఉన్న వెలమ వంశానికి చెందిన మరో రేచర్ల కుటుంబంతో వీరిని వేరు చేయాలని కూడా స్పష్టం చేస్తుంది.

కాకతీయుల కాలపు రేచర్ల రెడ్లు ≠ తరువాతి రాచకొండ రేచర్ల వెలమలు. ఇద్దరూ వేర్వేరుగా MCRHRDI గ్రంథం తెలియజేస్తున్నది.. కాకతీయుల కాలపు రేచర్లను Reddis by casteగా, తరువాతి మరో రేచర్ల కుటుంబాన్ని Velama casteకు చెందినదిగా MCRHRDI స్పష్టంగా పేర్కొంటుంది

కాబట్టి “రేచర్ల రుద్రుడు రెడ్డి కులానికి చెందినవాడు” అనే విషయానికి ప్రస్తుతం మనకు దొరికిన ప్రభుత్వ చారిత్రక ఆధారం ఉంది అని చెప్పవచ్చు

రాయచోటి 💁 లో మటన్ కేజీ ₹900/- అంట మరి మీ ఊర్లో
27/09/2026

రాయచోటి 💁 లో మటన్ కేజీ ₹900/- అంట మరి మీ ఊర్లో

రాయచోటి 💁 లో చికెన్ కేజీ ₹220/-
27/09/2026

రాయచోటి 💁 లో చికెన్ కేజీ ₹220/-

 విజయవాడ మిస్సింగ్‌ కేసులో షాకింగ్ ట్విస్ట్‌..🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨టాటూ వల్లే కళ్యాణి🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ...
27/09/2026


విజయవాడ మిస్సింగ్‌ కేసులో షాకింగ్ ట్విస్ట్‌..
🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨టాటూ వల్లే కళ్యాణి🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 17న కళ్యాణి కనిపించకుండా పోగా.. అదే రోజు ఆమె హత్యకు గురైనట్లు దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. కళ్యాణి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆమె సోదరుడు ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫొటోల ఆధారంగా ఆమె చేతిపై ఉన్న టాటూను గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎన్టీటీపీఎస్‌ చన్నీళ్ల కాలువలో రెండ్రోజులుగా మహిళకు సంబంధించిన శరీర భాగాలను వేర్వేరు సమయాల్లో స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటిగా శుక్రవారం మహిళ మొండెంను సేకరించి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం పరిస్థితి మేరకు హత్యగా భావించి, ఆ దిశగా పలు కోణాల్లో వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే మొండెం లభించిన తర్వాత తల, చేతులు, కాళ్లు శనివారం లభించాయి. ఎక్స్‌ఎల్‌ సైజులో ఉన్న బ్లూ రంగు టాప్‌ పంజాబీ డ్రస్‌, లెగ్గిన్‌, బంగారు రంగులో ఉన్న ముక్కు పుడక, చెవి రింగులు, గాజులు, వెండి పట్టీలు, చేతిపై నల్లని ఈక టాటూను గుర్తించారు.
ఇక, ఈ కేసులో భవానీపురానికి చెందిన షఫీని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కళ్యాణికి, షఫీకి గతంలో పరిచయం ఉండగా, వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, ఆమె కుమారుడిని షఫీ పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కుమారుడి విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నట్లు సమాచారం. తన కుమారుడిని తనకు అప్పగించాలని కళ్యాణి షఫీపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే షఫీ ఆమెను హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ కేసులో పూర్తి కారణాలు, హత్యకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

27/09/2026

🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసుల ఛేదన – 12 మోటార్ సైకిళ్లు రికవరీరాయచోటి అర్బన్ పోలీ...
26/09/2026


రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసుల ఛేదన – 12 మోటార్ సైకిళ్లు రికవరీ
రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన TVS XL మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన మైనర్ బాలురను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.
వారి వద్ద నుండి వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన మొత్తం 12 మోటార్ సైకిళ్లను పోలీసులు రికవరీ చేశారు.
రికవరీ చేసిన వాహనాలకు సంబంధించి వాటి యజమానులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం వాహనాలను అప్పగించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
మైనర్ బాలురు దొంగతనాలకు పాల్పడిన నేపథ్యంలో, వారి విషయంలో జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం మరియు సంబంధిత చట్టాల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.
ఈ కేసులను ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి, తప్పనిసరిగా హ్యాండిల్ లాక్/ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలి.

26/09/2026

😄😄😄😄😄😄😄😄

Address

Rayachoti

Telephone

+918639347143

Website

Alerts

Be the first to know and let us send you an email when 123Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share