03/04/2020
కలిసిరండి కదలిరండి
మన గమ్యం తెలుసుకోండి
పోయేవి తెగిరాలిపోయేవి దిగజారిపోయేవి
మన దాస్యబంధాలే
వచ్చేవి విజయాలుతెచ్చేవి సుఖశాంతులిచ్చేవి
మన భావిరాజ్యాలే
వేచి విసిగి ఓరిమి చచ్చిందిరా
అటోఇటో తేల్చుకునే సమయం వచ్చిందిరా
బెదిరింపుల కెదిరింపులే జవాబుగా
పదండిరా హుషారుగా
కలిసిరండి కదలిరండి
మన గమ్యం తెలుసుకోండి!
- శ్రీశ్రీ