𝐘𝐒𝐑𝐂𝐏 𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐌𝐞𝐝𝐢𝐚 𝐕𝐢𝐣𝐚𝐲𝐚𝐧𝐚𝐠𝐚𝐫𝐚𝐦 𝐃𝐢𝐬𝐭

  • Home
  • India
  • Vizianagaram
  • 𝐘𝐒𝐑𝐂𝐏 𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐌𝐞𝐝𝐢𝐚 𝐕𝐢𝐣𝐚𝐲𝐚𝐧𝐚𝐠𝐚𝐫𝐚𝐦 𝐃𝐢𝐬𝐭

𝐘𝐒𝐑𝐂𝐏 𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐌𝐞𝐝𝐢𝐚 𝐕𝐢𝐣𝐚𝐲𝐚𝐧𝐚𝐠𝐚𝐫𝐚𝐦 𝐃𝐢𝐬𝐭 𝘝𝘐𝘡𝘐𝘈𝘕𝘈𝘎𝘈𝘙𝘈𝘔 𝘋𝘐𝘚𝘛 𝘚𝘖𝘊𝘐𝘈𝘓 𝘔𝘌𝘋𝘐𝘈, #𝘛𝘌𝘈𝘔𝘊𝘏𝘐𝘕𝘕𝘈𝘚𝘙𝘐𝘕𝘜𝘈𝘕𝘕𝘈

'భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ ఎవరు చేశారు?'భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో ...
01/08/2026

'భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ ఎవరు చేశారు?'

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్‌ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్‌ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు.

ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన బొత్స.. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్‌ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు.

'2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?, 15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్‌ జగనే చేశారు' అని స్పష్టం చేశారు.

31/07/2026
31/07/2026
మ‌రి కుప్పం ఎయిర్‌పోర్ట్ పూర్తిచేయ‌లేదేం? – నెటిజ‌న్ల‌ ప్ర‌శ్న‌.విజయనగరం జిల్లా,.ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన భోగ...
31/07/2026

మ‌రి కుప్పం ఎయిర్‌పోర్ట్ పూర్తిచేయ‌లేదేం? – నెటిజ‌న్ల‌ ప్ర‌శ్న‌.

విజయనగరం జిల్లా,.

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన భోగాపురం (Bhogapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా జాతికి అంకితం కానున్న ఈ శుభతరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YSRCP), టీడీపీల(TDP) మధ్య “క్రెడిట్ వార్”(Credit War) తీవ్ర రూపం దాల్చింది. తామంటే తామే అత్యధిక అనుమతులు తెచ్చి, భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగవంతం చేశామని ఇరు పార్టీల నేతలు, సోషల్ మీడియా విభాగాల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది.

ఈ నేప‌థ్యంలో భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన రోజున జీఎంఆర్ గ్రూప్(GMR Group) అధినేత గ్రంధి మల్లికార్జునరావు (Grandhi Mallikarjuna Rao) సభా వేదికపై నుండి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు రీ-షేర్ చేస్తున్నారు. “గతంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ఫౌండేష‌న్‌, ప్రారంభోత్స‌వం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) సమక్షంలో.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో ఫౌండేషన్ వేయడం భ‌గ‌వంతుడి నిర్ణ‌యం” అని ఆయ‌న చెప్పిన మాట‌ల వీడియో వైర‌ల్ అవుతోంది.

టీడీపీకి ఇరకాటంగా ‘కుప్పం’ లాజిక్
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా భోగాపురం ప్రాజెక్టు క్రెడిట్ తమదేనని ప్రచారం చేస్తున్న వేళ, నెటిజన్లు ఒక లాజిక‌ల్ క్వ‌శ్చ‌న్‌తో ఆ పార్టీని ప్ర‌శ్నిస్తున్నారు. 2019 జనవరి 3న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విమానాశ్రయానికి (Kuppam Airport Project) శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా, కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు.

సొంత నియోజకవర్గంలో భూమి పూజ చేసిన ప్రాజెక్టునే పూర్తి చేయలేకపోయినప్పుడు, భోగాపురం క్రెడిట్ మొత్తం తమదే అని చెప్పుకోవడంలో ఏమైనా లాజిక్ ఉందా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అనుమతులు సాధించడం, రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ (Land Acquisition) పూర్తి చేయడం, ఆ భూమిని జీఎంఆర్ (GMR) సంస్థకు అప్పగించడం వంటి కీలక ఘట్టాలన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆధారాలు గూగుల్‌లో సైతం స్పష్టం చేస్తున్నాయంటున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం ముఖ్యమైన అనుమతులు తెచ్చి, నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తిచేసి 2026 నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చేలా కచ్చితమైన టైమ్‌లైన్ నిర్దేశించి పనులు నడిపింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని (YS Jagan Government) గణాంకాలు చెప్తున్నాయంటున్నారు. మరి శంకుస్థాపనల వరకే పరిమితమై కుప్పం ఎయిర్‌పోర్టును వదిలేసిన టీడీపీ(TDP) నేతలు, భోగాపురం క్రెడిట్ తమదంటూ చేస్తున్న ప్రచారానికి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.

తేదీ జగన్ హయంలో చేసిన పనులు.. గూగుల్ డేటా
12 జూన్ 2020 జీఎంఆర్ (GMR) సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ పూర్తి.
11 నవంబరు 2020 కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్ / ఇన్‌-ప్రిన్సిపల్ అప్రూవల్.
13 సెప్టెంబరు 2022 విశాఖ నేవల్ ఎయిర్‌బేస్‌లోని సివిల్ ఎన్‌క్లేవ్ మూసివేతకు కేంద్ర NOC సాధన.
23 ఫిబ్రవరి 2023 ఎయిర్‌పోర్టుకు రోజుకు 5 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు జీవో జారీ.
23 ఫిబ్రవరి 2023 ఎయిర్‌పోర్టు బౌండరీ వరకు విద్యుత్ సరఫరాకు ఉత్తర్వులు.
6 ఏప్రిల్ 2023 BCASతో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఒప్పందం.
3 మే 2023 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ భూమిపూజ.
16 మే 2023 ఏరోనాటికల్ సేవల మద్దతుకు కేంద్రం–GVIAL మధ్య MOU.
31 అక్టోబరు 2023 2,203.26 ఎకరాల స్పష్టమైన భూమిని జీఎంఆర్‌కు అప్పగింత

Address

జిల్లా పరిషత్ విజయనగరం
Vizianagaram
535001

Alerts

Be the first to know and let us send you an email when 𝐘𝐒𝐑𝐂𝐏 𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐌𝐞𝐝𝐢𝐚 𝐕𝐢𝐣𝐚𝐲𝐚𝐧𝐚𝐠𝐚𝐫𝐚𝐦 𝐃𝐢𝐬𝐭 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share